Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిగ్ షాక్: ఐదు చలాన్లు దాటితే అంతే సంగతి. మీ లైసెన్స్, ఆర్సీ కట్!

తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, పెండింగ్ చలాన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్రాఫిక్ జరిమానాలను నిర్లక్ష్యం చేస్తే కేవలం జరిమానాతోనే సరిపెట్టకుండా, వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనం రిజిస్ట్రేషన్ కార్డు (RC)ను కూడా ఫ్రీజ్ చేసేలా రవాణా శాఖ కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిని కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.

చలాన్ల విషయంలో వాహనదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పారదర్శకగా పరిష్కరించేందుకు ప్రభుత్వం 'గ్రీవెన్స్‌ రెడ్రెసల్‌ అథారిటీ'ని నియమించనుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుంది. ఇకపై చలాన్లపై అభ్యంతరాలు ఉంటే కేవలం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ దరఖాస్తులకు తావుండదు. అధికారులు ఆ ఫిర్యాదులను పరిశీలించి, తమ నిర్ణయాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో (SMS లేదా మెయిల్) వాహనదారులకు తెలియజేస్తారు.

TG Traffic Rules Drive License and RC to be Blocked for Pending Fine New Grievance Redressal Body Setup

అధికారుల విభజన ఇలా..

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ (మల్కాజిగిరి) వంటి ప్రధాన కమిషనరేట్లలో ట్రాఫిక్ డీసీపీలు ఈ వివాదాలను పరిష్కరిస్తారు. ఇతర నగర కమిషనరేట్లలో అదనపు డీసీపీలు, జిల్లాల్లో ఎస్పీ లేదా అదనపు ఎస్పీ స్థాయి అధికారులు గ్రీవెన్స్ అధికారులుగా వ్యవహరిస్తారు. రవాణా శాఖ పరంగా చూస్తే డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, ఆర్టీఓలు చలాన్ల అభ్యంతరాలను పర్యవేక్షిస్తారు. సాంకేతిక లోపాలు, డేటా ఎంట్రీ పొరపాట్లు లేదా వాహనం విక్రయించిన తర్వాత వచ్చే పాత చలాన్ల వంటి సమస్యలను వీరు పరిష్కరిస్తారు.

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం డిస్కౌంట్..?? సజ్జనార్ క్లారిటీ ..
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం డిస్కౌంట్..?? సజ్జనార్ క్లారిటీ ..

సమయపాలన - నిబంధనలు

కొత్త విధానం ప్రకారం.. కెమెరాల ద్వారా నమోదైన ఉల్లంఘనలకు సంబంధించి 3 రోజుల్లోగా, నేరుగా తీసిన చలాన్లయితే 15 రోజుల్లోగా నోటీసులు పంపాలి. చలాన్ అందిన 45 రోజుల్లోపు వాహనదారుడు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఫిర్యాదు అందిన 30 రోజుల్లోపు అధికారులు దానిపై నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అధికారుల నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే, జరిమానాలో 50 శాతం చెల్లించి కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు తుది నిర్ణయం ప్రకారం చలాన్ రద్దు లేదా చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది.

Driving Licenses కొత్త రూల్స్.. గ్రేడ్లు పోతే శాశ్వతంగా లైసెన్స్ రద్దు!
Driving Licenses కొత్త రూల్స్.. గ్రేడ్లు పోతే శాశ్వతంగా లైసెన్స్ రద్దు!

ఐదు చలాన్లు దాటితే లైసెన్స్ బ్లాక్!

ప్రధానంగా ఏడాది కాలంలో ఒక వాహనంపై 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే, ఆ సమాచారం నేరుగా రవాణా శాఖకు చేరుతుంది. అప్పుడు అధికారులు సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను గానీ, వాహనం ఆర్సీని గానీ బ్లాక్ చేస్తారు. ఒకసారి బ్లాక్ అయిన తర్వాత, పెండింగ్ చలాన్లు పూర్తిగా చెల్లిస్తేనే ఆర్టీఏ సేవలు (రెన్యూవల్స్, ట్రాన్స్‌ఫర్స్ వంటివి) తిరిగి యాక్టివేట్ అవుతాయి. ఈ కొత్త విధానంపై పూర్తి వివరాలతో కూడిన పోర్టల్ సమాచారం త్వరలోనే ప్రభుత్వం వెల్లడించనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+