కేసీఆర్ తిక్కపనులు: తమ్మినేని, స్వచ్ఛ హైదరాబాద్‌పై సమావేశం రద్దు
హైదరాబాద్: సీఎం కేసీఆర్ తిక్కపనులు చేస్తున్నారని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులకు తన మద్దతుని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని ఊడ్చేయడానికి కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కార్మికులు లేకుండా స్వచ్ఛ భారత్ సాధ్యమా? చీపుర్లతో పోటోలు దిగితే స్వచ్ఛ భారత్ అవుతుందా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. నగరంలో కంపుకు సీఎం కేసీఆర్‌దే బాధ్యతని కార్మికులను ఏమాత్రం తిట్టవద్దని నగర వాసులకు తమ్మినేని వీరభద్రం సూచించారు.
ఇది ఇలా ఉంటే మున్సిపల్ కార్మికులు చేపట్టిన ధర్నా శనివారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. ఈ ధర్నాలో 7 కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగిన కార్మిక సంఘాలకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మద్దతు ప్రకటించాయి. ఇక స్వచ్ఛ హైదరాబాద్‌పై జరగాల్సిన సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది.

శనివారం సీఎం కేసీఆర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంపై సమావేశం ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంపై సమావేశం నిర్వహిస్తే జీహెచ్‌ఎంసీ అధికారులు, ప్రజా ప్రతినిధులు కేసీఆర్‌ను నిలదీసే అవకాశం ఉంది.
నగరంలో పేరుకుపోయిన చెత్తపై ముందుగా నిర్ణయం తీసుకోకుండా, స్వచ్ఛ హైదరాబాద్‌పై నిర్ణయం ఏమిటని అందరూ ప్రశ్నించే అవకాశం ఉన్నందున ఈ సమావేశాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications