Smita Sabarwal: మీరెప్పుడైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కారా స్మితా సబర్వాల్..!
ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పై వివాదం కొనసాగుతూనే ఉంది. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అన్న ఆమె అభిప్రాయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. "డిఫరెంట్లీ ఏబుల్డ్‌కి సకల గౌరవం. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా. #AIS (IAS/IPS/IFoS) స్వభావం ఫీల్డ్-వర్క్, ఎక్కువ సమయం పన్ను విధించడం, ప్రజల మనోవేదనలను నేరుగా వినడం-దీనికి శారీరక దృఢత్వం అవసరం" అని స్మితా ట్వీట్ చేశారు.
దీంతో దివ్యాంగులు తీవ్రంగా స్పందిస్తున్నారు. రైలులో ప్రయాణిస్తూ దొంగలు బయటకు నెట్టితే కాలు పోగొట్టుకున్న అరుణిమా సిన్హా ఎవరెస్ట్ ఎక్కిందని గుర్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన సుధా చంద్రన్ భరతనాట్యంలో గొప్పగా రాణించారు. వ్యాధితో నడుము కింది భాగం కోల్పోయిన దీపా మాలిక్ పారాలంపియన్ లో మేడల్ సాధించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది దివ్యాంగులు ఎన్నో సాధించారని గుర్తు చేస్తున్నారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సరైనవి కావని పేర్కొంటున్నారు.

రెండు చేతులు లేకున్నా ఓ మహిళ విమానం నడుపుతూ పైలట్ గా రాణిస్తుందని చెబుతున్నారు. ఇది దివ్యాంగులకు ఉన్న పట్టదల అంటూ నొక్కి చెబుతున్నారు. "అంగవైకల్యం తమ అవయవాలకు కావొచ్చు కానీ.. మా మనోధైర్యానికి, మా తెలివి తేటలకు కాదు" అని చెబుతున్నారు.
ఏడాదికి ఒకరో ఇద్దరో దివ్యాంగులు సివిల్ సర్వెంట్లు అయితే ఎందుకు అంతా అసూయ అంటూ మండిపడుతున్నారు. CSB IAS అకాడమీ చీఫ్ బాల లత స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఐఏఎస్ కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దివ్యాంగుల గురించి మాట్లాడటానికి మీరెవరు అంటూ నీల దీశారు. స్మితా వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ఆ వ్యాఖ్యలను ఖండించారు.












Click it and Unblock the Notifications