Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వివేక్ వద్ద కేసీఆర్ అప్పు: సంపన్న, పేద నేతలెవరు- లెక్క ఇదే..!!

తెలంగాణ ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక అసలు పోటీలో ఉన్న అభ్యర్దులు ఎవరో తేలిపోయింది. ప్రచారం పర్వం పతాక స్థాయికి చేరింది. ఈ సమయంలోనే బరిలో నిలిచిన వారిలో సంపన్నులు ఎవరు...నిరుపేదలు ఎవరనే ఆసక్తి మొదలైంది. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ఆధారంగా పోటీ చేస్తున్న అభ్యర్దుల్లో సంపన్నుడు గడ్డం వివేక్ కాగా..నిరుపేద బీజేపీ నేత బండి సంజయ్ గా నిలిచారు. టాప్ -20 లో పది మంది కాంగ్రెస్ నేతలే ఉన్నారు.

అభ్యర్దులు ఆస్తుల లెక్కలు: తెలంగాణలో ఎన్నికల అఫిడవిట్లలో అభ్యర్థులు తమ ఆస్తులు - అప్పుల వివరాలు ప్రకటించారు. వారిలో చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న గడ్డం వివేక్‌ రూ.606 కోట్లతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. పేద అభ్యర్థిగా బీజేపీ కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌ ఉన్నారు. చెన్నూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వివేక్‌ ఆస్తులు రూ.606.67 కోట్లుగా పేర్కొన్నారు. చరాస్తులు రూ.380.76 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.225.91 కోట్లు అని ఆయన తెలిపారు. తనకు, తన భార్యకు రూ.45.44 కోట్ల ఆప్పులు ఉన్నట్లు వివరించారు.

The five richest candidates for the Telangana elections come from the BRS and the Congress

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ ఆస్తులు రూ.461.05 కోట్లు. ఆయన వార్షికాదాయం రూ.32.07 లక్షలు కాగా.. పొంగులేటి సతీమణి మాధురి ఆదాయం రూ.3.04 కోట్లు. అవిభాజ్య కుటుంబ ఆదాయం రూ.6.50 లక్షలే.

సంపన్నుడిగా వివేక్: పొంగులేటి పేరిట రూ.32.44 కోట్ల చరాస్తులు, రూ.23.97 కోట్ల స్థిరాస్తులున్నాయి. రూ.4.22 కోట్ల మేర అప్పు ఉంది. మాధురి పేరిట రూ.391.63 కోట్ల చరాస్తులు, రూ.12.11 కోట్ల స్థిరాస్తులుండగా, రూ.39.30 కోట్ల మేర రుణాలున్నాయి. అవిభాజ్య కుటుంబం కింద రూ.4.70 లక్షల చరాస్తులు, రూ.85 లక్షల స్థిరాస్తులున్నట్లు పొంగులేటి ప్రకటించారు. మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆస్తులు రూ.458.39 కోట్లుగా ఉన్నాయి.

The five richest candidates for the Telangana elections come from the BRS and the Congress

ఆయన వార్షికాదాయం రూ.71.17 కోట్లు. భార్య లక్ష్మి వార్షికాదాయం రూ.1.27 లక్షలు. ఇరువరి అప్పులు రూ.4.14 కోట్లు. వీరికి ఎలాంటి వాహనాలు లేవు. కారు గుర్తు గల బీఆర్‌ఎస్‌ అధిపతి, సీఎం కేసీఆర్‌కు కారే లేదు. ఆయన కుటుంబానికి రూ.58.93 కోట్ల మేర ఆస్తులున్నాయి. వీటిలో స్థిరాస్తులు రూ.23.50 కోట్లు, చరాస్తులు రూ.35.43 కోట్లు. మాజీ ఎంపీ జి.వివేక్‌ నుంచి రూ.1.06 కోట్లు అప్పు తీసుకున్నట్లు కేసీఆర్‌ పేర్కొన్నారు.

రేవంత్ ఆస్తుల వివరాలు: మంత్రి కేటీఆర్‌.. తన కుటుంబానికి మొత్తం రూ.53.31 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించారు. ఇందులో చరాస్తులు రూ.35.01 కోట్లు, స్థిరాస్తులు రూ.18.30 కోట్లు కాగా, రూ.11.99 కోట్ల మేర రుణాలున్నాయని వెల్లడించారు. 4.8 కిలోల బంగారం, 38.17 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. గజ్వేల్‌, హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు రూ.50.93 కోట్ల మేర ఆస్తులున్నాయి. ఇందులో చరాస్తులు రూ.23.65 కోట్లు, స్థిరాస్తులు రూ.27.28 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనకు కారు లేదని.. 13.25 ఎకరాల భూమి ఉన్నట్లు చెప్పారు.

The five richest candidates for the Telangana elections come from the BRS and the Congress

ఆయన భార్య జమున పేరిట 59 ఎకరాలున్నాయి. రూ.19 కోట్ల మేర అప్పు ఉన్నట్లు ఈటల అఫిడవిట్‌ స్పష్టం చేస్తోంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆస్తులు రూ.30.04 కోట్లు. ఇందులో స్థిరాస్తులు రూ.24.87 కోట్లు, చరాస్తులు రూ.5.17 కోట్లు. చరాస్తుల్లో ఆయన పేరిట రూ.2.18 కోట్లు, భార్య గీత పేరిట రూ.2.92 కోట్లు, కుటుంబ సభ్యుల పేరిట రూ.5.50 లక్షలు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. రుణాలు, ఆస్తి పన్ను బకాయిలు, ఇంటి రుణాలు అన్నీ కలిపి దాదాపు రూ.1.46 కోట్ల దాకా ఉన్నట్లు వివరించారు.

పేద నేతగా బండి: సిద్దిపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి హరీశ్‌రావు కుటుంబ ఆస్తి రూ.24.29 కోట్లు. కుటుంబానికి మొత్తం రూ.11.50 కోట్ల అప్పులుఉన్నాయి. మధిర కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కకు నయాపైసా అప్పు లేదు. కుటుంబ సభ్యులందరికీ కలిపి రూ.8.13 కోట్ల మేర ఆస్తులున్నాయి. హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి రూ.5.82 కోట్ల మేర ఆస్తులున్నాయి.

The five richest candidates for the Telangana elections come from the BRS and the Congress

తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ ప్రకటించారు. తనకు ఒకటి, భార్య పేరిట మరో కారు ఉన్నాయని తెలిపారు. చేతిలో రూ.లక్షన్నర, సతీమణి దగ్గర రూ.లక్ష నగదు ఉన్నాయని తెలిపారు. చరాస్తుల విలువ రూ.79.51 లక్షలని, కుటుంబానికి ఎలాంటి స్థిరాస్తులు లేవని ప్రకటించారు. రూ.17.84 లక్షల మేర అప్పులున్నట్లు పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+