Sriramsagar: బాబ్లీ గేట్లు ఎత్తిన అధికారులు.. శ్రీరాంసాగర్ కు రానున్న వరద..
తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించి 20 రోజులు దాటినా అనుకున్న స్థాయిలో వర్షాలు కురవడం లేదు. రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి మట్టం డెడ్ స్టోరెజీకి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటు గోదావరి బేసిన్ లో శ్రీరాంసాగర్ లో కూడా నీటి మట్టం భారీగా తగ్గింది. మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లిలో కూడా నీటి మట్టం తగ్గింది.
ఇప్పుడు వర్షాలు కురిస్తే తప్ప నీటి కష్టాలు తొలకవు. తాజాగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. దీంతో శ్రీరాంసాగర్ కు నీరు వచ్చే అవకాశం ఉంది. సోమవారం ఉదయం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో గేట్లను ఎత్తారు. జులై ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తీసి ఉంటాయి. దీనిపై ఎస్సారెస్పీ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ గుప్తా వివరించారు.

బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను వరుస క్రమంలో సాయంత్రం వరకు ఎత్తుతామని వివరించారు. దీంతో గేట్ల విడుదలతో ఎగువన ఉన్న 0.2 టీఎంసీల నీళ్లు దిగువకు వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఏడాది జూలై 1న గేట్లు ఎత్తుతారు. మహారాష్ట్రలో బాబ్లిగేట్లు ఎత్తడం వల్ల శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుంది.
ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా, సిడబ్ల్యూసి ఈఈ వెంకటేశ్వర్లు, ఈఈ చక్రపాణి, నాందేడ్ ఈఈ బాన్సద్, ఏఈఈ వంశీ, ఎస్డీఈ సతీష్ పాల్గొన్నారు. ఎస్సారెస్పీ నిండితే నీరు మిడ్ మానేరు, లోయర్ మానేరుకు విడుదల చేస్తారు.












Click it and Unblock the Notifications