Turmeric: రికార్డు ధర పలికిన పసుపు.. క్వింటా రూ.15 వేలకు పైనే..
చాలా ఏళ్ల తర్వాత పసుపు పంట మంచి ధర పలుకుతోంది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మార్కెట్ లో క్వింటా పసుపు రూ. 15,111 పలికింది. 15 సంవత్సరాల తర్వాత పసుపు ధర రూ.15 వేలకు పైగా పెరగడం ఇది మొదటిసారి. పసుపు ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ లో కూడా పసుపు భారీ ధరనే పలుకుతోంది. అయితే అక్కడికి వెళ్లడం, రవాణా ఖర్చులు, దూరం ఎక్కువ ఉండడంతో నిజామాబాద్, మెట్ పల్లి మార్కెట్లకే తీసుకొచ్చి అమ్ముతున్నారు.
ఇక మెట్ పల్లి మార్కెట్ కు డైలీ రెండు నుంచి మూడు వేల క్వింటాళ్ల పసుపు వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. పసుపు ధర లేక చాలా సంవత్సరాలు రైతులు ఇబ్బంది పడ్డారు. పసుపు కనీస మద్దతు ధర రూ.15 వేలు నిర్ణయించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు డిమాండ్ ఉండడంతో పసుపు ధర పెరిగింది. అయితే ఎప్పుడు పసుపు ధర ఇలానే ఉంటుందా అంటే.. సమాధానం లేని ప్రశ్నే.

నిజామాబాద్, మెట్ పల్లి, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లలో 2009లో పలుపు క్వింటా రూ.15 వేలు పలికింది. ఆ తర్వాత 2024లో అంటే ఇప్పుటు రూ.15 వేలు పలికింది. ఈ మధ్యలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో పసుపు సాగు కూడా తగ్గించారు. జగిత్యాల జిల్లాలో సాధారణంగా 40 నుంచి 45 వేల ఎకరాల్లో పసుపు వేస్తారు. కానీ.. ఈ సంవత్సరం 22 వేల ఎకరాల్లోనే పసుపు సాగు చేశారు. పసుపు ధర పెరగడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
సాగి విస్తీర్ణం పెరిగి దిగుబడి పెరిగితే మరోసారి పసుపు ధర పడిపోయే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. అయితే పసుపు సులభమైన ప్రక్రియ ఏం కాదు. పసుపు సాగు చేసే వారు చాలా పవిత్రంగా ఉండాలి. స్నానం చేసిన తర్వాత పసుపు పంటలోకి వెళ్లాలి. పసుపును చాలా పవిత్రంగా పండిస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications