హార్లీ డేవిడ్‌సన్ షోరూంలో 'ట్రయల్ రన్'తో రూ.8 లక్షల బైక్ ఎత్తుకెళ్లాడు
హైదరాబాద్: భాగ్యనగరంలో ఓ దొంగ ట్రయల్ రన్ పేరు చెప్పి నగరంలోని హార్లీ డేవిడ్ సన్ షోరూంలో ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటనకు సంబంధించి హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో మంగళవారం కేసు నమోదయింది.
నగరంలోని హార్లీ డేవిడ్ సన్ షోరూంలో ఓ వ్యక్తి బైక్ చూసేందుకు వచ్చాడు. ట్రయల్ రన్ పేరుతో రూ.8 లక్షల రూపాయల విలువైన బైక్‌ను తీసుకు వెళ్లాడు. ట్రయల్ రన్ కోసం వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఖమ్మం జిల్లా బాలిక హత్య కేసులో ఆరుగురి అరెస్టు
ఖమ్మం జిల్లాలోని బాలిక పైన అత్యాచారం కేసులో పోలీసులు ఆరుగురిని మంగళవారం నాడు అరెస్టు చేశారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో బాలిక పైన అత్యాచారం చేసిన విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే.
డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ ఆకస్మిక తనిఖీ
హైదరాబాదులో శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications