రెచ్చిపోయిన దొంగలు: మియాపూర్‌లో భారీ చోరీ
హైదరాబాద్: నగరంలో దొంగలు రెచ్చిపోయారు. పెద్దఎత్తున బంగారం, వెండి నగలు, నగదు చోరీ చేశారు. మియాపూర్ లేక్‌వ్యూ ఎన్‌క్లేవ్ బ్లాక్-1, జీ-4లో అమర్‌నాథ్, నిత్య దంపతులు నివసిస్తున్నారు. వారితోపాటు అమర్‌నాథ్ తల్లి ప్రభావతి ఉంటున్నారు. దసరా సెలవులు నిమిత్తం నిత్య స్వగ్రామానికి వెళ్లారు. అమర్‌నాథ్ కంపెనీ పనిమీద రెండు రోజుల క్రితం ముంబైకి వెళ్లగా గురువారం రాత్రి ప్రభావతి అదే కాలనీలో ఉండే కుమార్తె విజయ ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపునకు సంబందించి తాళం బద్దలు కొట్టకుండా గొళ్లెం స్క్రూలు తొలగించి ఉన్నాయి. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా రెండు పడక గదుల్లోని రెండు బీరువాలు పగులుగొట్టి ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 50తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులు, రూ. 20వేల నగదును దొంగతనానికి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications