వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ గెలుపుపై కేటీఆర్‌కు మాటలు రావడంలేదు...లక్ష్మణ్

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా వెలువడిన ఫలితాల సునామీలో తెలంగాణలో కూడ బీజేపీకి అనూహ్యంగా గాలి వీచింది. ఈనేపథ్యంలోనే ఆపార్టీ నలుగురు ఎంపీ స్థానాలను గెలుచుకుంది.దీంతో ఆపార్టీ రాష్ట్ర్ర కార్యాలయంలో విజయోత్సవ సభలు నిర్వహించారు.ఈ సంధర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శీ మురళిధర్ రావు మాట్లడుతూ... పశ్బిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చూసైన సీఎం కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. కాగా ప్రధాని నరేంద్రమోడీ ముందు అందరు దిగదుడుపేనని తెలిపారు. మోడీ ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పనికి రారని తెలంగాణ ప్రజలు తేల్చారని అన్నారు.. మరోసారి మోడీని విమర్శించే ధైర్యం చేయవద్దని ఆయన హెచ్చరించారు.

 బీజేపీ గెలుపుపై కేటీఆర్‌కు మాటలు రావడంలేదు...లక్ష్మణ్

బీజేపీ గెలుపుపై కేటీఆర్‌కు మాటలు రావడంలేదు...లక్ష్మణ్

తెలంగాణలో బీజేపీ ఫలితాలను చూసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌‌కు నోటా మాటలు రావడంలేదని బీజేపీ రాష్ట్ర్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కవితను సాగనంపి, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పారని అన్నారు.ఇక నరేంద్రమోడియె మాకు అంబెద్కర్ అంటూ ఆయన పేర్కోన్నారు.

బోందుగాళ్లకు తెలంగాణలో స్థానం లేదు... బండి సంజయ్

బోందుగాళ్లకు తెలంగాణలో స్థానం లేదు... బండి సంజయ్

కరీంనగర్ సభలో బీజేపీని ఉద్దేశిస్తూ ఇందుగాళ్లు ,బొందుగాళ్లు అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కరీంనగర్ ఎంపీ బండిసంజయ్ స్పందించారు. తెలంగాణలో హిందుగాళ్లకు తప్ప ,బొందుగాళ్లకు స్థానం లేదని అన్నారు. తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లిన టీఆర్ఎస్ అహంకారం గురించే మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

 కేసిఆర్ ఓవైసిని నమ్ముకున్నారు..కిషన్ రెడ్డి

కేసిఆర్ ఓవైసిని నమ్ముకున్నారు..కిషన్ రెడ్డి

ఇక అధికారం కోసం సీఎం కేసీఆర్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీని నమ్ముకున్నారని సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నియంత పాలనను కొనసాగించి ,ప్రజా సంఘాలను అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. రాజ్యంగబద్దమైన వ్యవస్థలో నియంతల పాలన కొనసాగదని అన్నారు.ఇకనైన నియంత పాలనను మార్చుకోవాలని హితవు పలికారు.

English summary
Telanagan BJP leaders have critised the cm kcr, Chief Minister KCR has to learn from mamata benarjee who lost thair seats in bengal said BJP general secretary Muralidhar Rao
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X