'కెసిఆర్ ఇంటికి బాబు.. మంచిదే, ఇక కలిసి హోదా-ప్యాకేజీ అడగాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం మంచిదేనని సిపిఐ సీనియర్ నేత నారాయణ గురువారం అన్నారు.
ఇరువురు ముఖ్యమంత్రులు (కెసిఆర్, చంద్రబాబు)లు కలిసి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడాలని అభిప్రాయపడ్డారు. వీరు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం నుంచి కోరాలని సూచించారు.

మంత్రి కేటీఆర్‌కు అఖిలేష్ సాదర స్వాగతం
తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఉత్తరప్రదేశ్‌లో ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం కేటీఆర్ యూపీ రాజధాని లక్నో చేరుకున్నారు.
కేటీఆర్‌కు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఇరువురి సమావేశంలో వాటర్ గ్రిడ్ పథకం వివరాలను మంత్రి కేటీఆర్... అఖిలేష్ యాదవ్‌కు వివరించనున్నారు. మంత్రి కేటీఆర్ వెంబడి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు రేమాండ్ పీటర్, సురేందర్‌రెడ్డి వెళ్లారు.












Click it and Unblock the Notifications