2018 తెలంగాణ బడ్జెట్: వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత, పెట్టుబడి స్కీమ్‌కు రూ.12 వేల కోట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. వ్యవసాయానికి ఈ ఏడాది నుండి రైతులకు పెట్టుబడి కోసం సుమారు 8వేల రూపాయాలను ఇవ్వనున్నట్టు సీఎం కెసిఆర్ ప్రకటించారు.ఈ మేరకు ఈ పెట్టుబడి కోసం తెలంగాణ బడ్జెట్‌లో నిధులను కేటాయించారు.
Recommended Video

వ్యవసాయం చేసేందుకు రైతులకు ముందుగానే నిధులను సమకూర్చనున్నారు. వ్యవసాయానికి పెట్టుబడి పథకం కింద బడ్జెట్‌లో రూ. 12 వేల కోట్లను కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.522 కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

గురువారం నాడు తెలంగాణ ఆర్థిక శాఖమంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పాలీ, గ్రీన్‌హౌజ్ కోసం రూ.12 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. రైతు భీమా పథకం కోసం మరో రూ.500 కోట్లను కేటాయించారు.
ప్రతి రైతుకు సుమారు రూ. 5లక్షల ఇన్సూరెన్స్‌ను అమలు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. దీనికి తోడు బిందు సేద్యానికి మరో రూ.127 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది.రైతులకు పెట్టుబడి పథకం కోసం రూ. అధికంగా నిధులు కేటాయించడం విశేషం,.












Click it and Unblock the Notifications