'ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం,ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి'
2019 లో అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: 2019 లో అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాల ఖాళీలున్నా ప్రభుత్వం ఈ ఖాళీలను భర్త చేయకుండా మీన మేషాలు లెక్కిస్తోందన్నారు.
తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రైవేట్ రంగంలో కూడ ఉద్యోగాలు తగ్గిపోయాయని చెప్పారు. ఐటీఐఆర్ గురించి కెసీఆర్ ప్రభుత్వం మాట కూడ మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ప్రభుత్వం నిరుద్యోగ భృతిని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఓయూ లో నిర్వహించే నిరుద్యోగ ధర్మ యుద్ద సభకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతిస్తోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కెసీఆర్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడ ఇవ్వలేదన్నారాయన.
కెసిఆర్ మాటలు చెప్పి పబ్బం గడుపుకొంటున్నాడని ఆయన ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications