'ఉప ఎన్నిక, గడ్కరీ రాకని టిఆర్ఎస్ చెక్! ఆత్మహత్యల జిల్లాగా కెసిఆర్ మెదక్'

హైదరాబాద్: పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర పర్యటనకు వస్తానంటే రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఇవ్వడానికి నిరాకరిస్తోందని, ఓ పక్క కేంద్రం తమ పైన వివక్ష చూపుతోందని విమర్శిస్తూనే, కేంద్రమంత్రి పర్యటనను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం ప్రశ్నించారు.

యాదాద్రి - వరంగల్ నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన చేయడానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వస్తానంటే టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.

TRS prevents Nitin Gadkari's arrival: Kishan Reddy

తెలంగాణలో శాంతిభద్రతల సమస్య ఉందన్నారు. ముఖ్యమంత్రి తీరికలేకుండా న్నారని ప్రభుత్వం సమాధానం చెబుతోందని మండిపడ్డారు. వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే గడ్కరీ పర్యటన పైన టిఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందన్నారు.

ప్రాజెక్టుల పైన సూచనలు చేసే ప్రతిపక్ష నేతలకు వ్యక్తిగత దురుద్దేశాలను ఆపాదించవద్దని మంత్రి హరీష్ రావుకు సూచించారు. బిజెపిలో విభేదాలు లేవని, ఉంటే కెసిఆర్ కుటుంబంలో ఉన్నాయేమో అని మండిపడ్డారు. టిఆర్ఎస్ పుట్టకముందే కృష్ణా, గోదావరి జలాల సద్వినియోగంపై పాదయాత్ర చేసిన చరిత్ర బిజెపిది అన్నారు. ఈ విషయం హరీష్ రావు గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్ ఆత్మహత్యల జిల్లాగా మారిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+