మత్తు మందిచ్చి కోల్‌కతా యువతిపై రేప్: ఉచ్చులో దింపిన లేడీ ఫోన్ స్విచాఫ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాద్‌‌లో పర్యటనకు వచ్చిన బెంగాలీ యువతిపై అత్యాచారం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు ప్రీత్‌ షెర్గిల్‌ కోరియాగ్రాఫర్ ముసుగులో ఉన్న దుర్మార్గుడని తెలుస్తోంది. చిన్నస్థాయి సినిమాలకు పనిచేస్తూనే ఈవెంట్‌ మేనేజర్‌‌గా, ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి యజమానిగా ఉన్నాడు.
యువతులపై అవకాశాలు కల్పిస్తామంటూ వల వేసి ముగ్గులోకి లాగి చెరబట్టడం చేస్తున్నాడని అనుమానిస్తున్నారు. నిందితుడి ఫోన్‌, ట్యాబ్‌లను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. మరింతగా విచారించేందుకు అదుపులోకి తీసుకోను న్నామని డీసీపీ బి.సుమతి తెలిపారు. గతంలో ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? అనే విషయాన్నీ పరిశీలిస్తున్నామన్నారు.

పింకీరాయ్‌తో సంబంధాలు..

కోల్‌కతా యువతితో క్యాబ్‌లో ప్రయాణించిన పింకీరాయ్‌కి షెర్గిల్‌కు కొంతకాలంగా సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. బాధితురాలి వివరాలను ప్రీత్‌కు చెప్పి ఆమెను అప్పగించిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారిద్దరినీ హోటల్‌కు తీసుకువచ్చిన క్యాబ్‌డ్రైవర్‌ను ప్రశ్నించారు.

కోల్‌కతా యువతిని వివస్త్రను చేసి కొరియోగ్రాఫర్ సహా రేప్: కుర్చీలో కట్టేసి, వీడియో తీసి...

పింకీరాయ్‌‌కి, బాధితురాలికి కారులో జరిగిన సంభాషణలపై అతన్ని పోలీసులు ప్రశ్నించారు. అయితే, తనకేమీ తెలియదని, విమానాశ్రయం నుంచి ఇద్దరిని కారులో ఎక్కించుకుని హోటల్‌లో దించేసి వెళ్లిపోయానని అతడు చెప్పినట్టు సమాచారం.

బెంగాలీ యువతిపై అత్యాచారం జరిగిన రోజు ప్రీత్‌ను పింకీరాయ్‌ రమ్మని చెప్పినట్టు ప్రీత్‌ ఫోన్‌ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. ఆమెను పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ కావడంతో ఇల్లు, ఇతర వివరాలపై ఆరా తీశారు..

ఎదురు తిరిగిన షెర్గిల్...

ఎదురు తిరిగిన షెర్గిల్...

పోలీసుల అదుపులో ఉన్న షెర్గిల్‌ పోలీసులకు ఎదురు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. తాను బెంగాలీ యువతిపై అత్యాచారం చేసినట్టు రుజువులు ఏమిటని అడిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె ఇంటి నుంచి పారిపోయినప్పుడే పోలీసులు విచారించే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసుకున్న ప్రీత్‌ తాను చిత్రీకరించిన అత్యాచార దృశ్యాలను ఫోన్‌, ట్యాబ్‌లోంచి తొలగించాడు.

 ఆ ధైర్యంతోనే...

ఆ ధైర్యంతోనే...

దృశ్యాలను ధైర్యంతోనే పోలీసులను ప్రశ్నించడంతోపాటు న్యాయవాదులున్నారని బెదిరించే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇన్‌స్పెక్టర్‌ సహా ఇద్దరు పోలీసులు ప్రీత్‌ను ఒక గదిలోకి తీసుకెళ్లారు. అతడి ఫోన్‌, ట్యాబ్‌లో తొలగించిన దృశ్యాలను తిరిగి చూపించడంతో అప్పుడు నేరం ఒప్పుకొన్నాడు. దీంతో అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన నలుగురు నిందితులను పట్టుకునే యత్నాలు చేస్తున్నారు.

ఆ రాతలతో దర్యాప్తు

ఆ రాతలతో దర్యాప్తు

వెస్ట్‌మారేడ్‌పల్లి కృష్ణపురికాలనీలోని ప్రీత్‌ ఇంట్లో బందీగా ఉన్న బెంగాలీ యువతి మూడోరోజు చిన్నకాగితంపై ‘ఐ యామ్‌ ఇన్‌ట్రబుల్‌' అని రాసి కిటికిలోంచి విసిరేసినట్లు పోలీసులు చెెబుతున్నారు. ఆ కాగితాన్ని అపార్ట్‌మెంట్‌ పక్కన ఉన్న స్థానికులు చూసి డయల్‌ 100కు ఫోన్‌చేశారు. అనంతరం చిలకల గూడ పోలీసులు వారంరోజుల పాటు పరిశోధించి ఆధారాలు దొరకకపోవడంతో ఆ కాగితం విషయం వదిలేశారు.

కోల్‌కత్తా వెళ్లేప్పుడు...

కోల్‌కత్తా వెళ్లేప్పుడు...

ప్రీత్ చెర నుంచి తప్పించుకుని కోల్‌కతా వెళ్లేప్పుడు బాధితురాలు శంషాబాద్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ కేసు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు బదిలీ అయింది. ఫోన్‌లోనే కాకుండా వీడియోఛాట్‌ ద్వారా బాధితురాలితో పోలీసులు మాట్లాడారు. పలుప్రాంతాల వివరాలు చెప్పి ఫొటోలు చూపించడంతో తనపై అత్యాచారం జరిగిన ప్రాంతాన్ని 90 శాతం వరకు చెప్పగలిగింది. దీంతో ‘ఐయామ్‌ ఇన్‌ ట్రబుల్‌' అని రాసి ఉన్న కాగితాన్ని పట్టుకుని పోలీసులు షెర్గిల్‌ అపార్ట్‌మెంట్‌ చుట్టూ తిరిగారు. చివరికి అతడే నిందితుడని అనుమానించి గత శనివారం అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The choreographer Preeth Shegil raped West Bengal girl is known for his activities in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి