విషాదం: పెళ్లిళ్లు ఇష్టం లేక ఇద్దరు యువతుల ఆత్మహత్య
వరంగల్: తమకు పెళ్లి ఇప్పుడే వద్దని చెప్పినా వినకుండా తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుండడంతో మనస్థాపానికి గురై వరంగల్ జిల్లాలో వేర్వురు ఘటనల్లో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్టేషన్‌ఘన్‌పూ ర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన కావటి యాదమ్మ, రవి దంపతుల కూతురు మౌనిక(20) మండల కేంద్రంలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.
ఇటీవల తల్లిదండ్రులు మౌనికకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడే పెళ్లి వద్దని డిగ్రీ పూర్తయ్యాక చేసుకుంటానని చెప్పినా పట్టించుకోలేదు. తల్లిదండ్రులు నాలుగురోజుల కిందట సిద్దిపేటలో చూసిన సంబంధం ఖరారయ్యే పరిస్థితి ఉండడంతో మౌనిక మనస్థాపానికి గురైంది.

శుక్రవారం తల్లిదండ్రులు వ్యవసాయపనులకు వెళ్లగా కళాశాలకు సెలవని ఇంటి వద్దే ఉన్న మౌనిక మధ్యాహ్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు తట్టుకోలేక బయటికి పరుగెత్తుతూ వచ్చిపడి పోయింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది.
మరో ఘటనలో నెక్కొండ మండలం అప్పల్‌రావుపేటకు చెందిన పాముల మౌనిక(18) మండల కేంద్రంలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొత్తగూడెంకు చెందిన ఓ యువకుడితో ఆరునెలల కిందట పెండ్లి కుదిరింది.
పెళ్లి ఇష్టం లేదని తల్లిదండ్రులకు మౌనిక పలుమార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో మనస్థాపానికి గురై శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications