3అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిన పాప, కాపాడపోయిన పదేళ్ల చిన్నారి: ఇద్దరూ మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే కాలనీలో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇధ్దరు చిన్నారులు మూడంతస్తుల భవనం నుంచి కిందపడి మృతి చెందారు.
18 నెలల చిన్నారి శ్రేయను కాపాడబోయి పల్లవి అనే పదేళ్ల చిన్నారి కాలుజారి పడిపోయింది. మూడో అంతస్తు నుంచి చిన్నారి కిందపడుతుండగా పల్లవి కాపాడబోయింది. భవనంపై నుంచి పాప పడిపోకుండా కొద్దిసేపు చిన్నారిని పల్లవి పట్టుకుంది.

చిన్నారి టీషర్ట్ చినిగిపోవడంతో పద్దెనిమిది నెలల పాప శ్రేయ మృతి చెందింది. చిన్నారిని పట్టుకునే క్రమంలో పల్లవి కూడా కాలు జారి భవనంపై నుంచి పడి మృతి చెందింది.
ఈ ఘటనను పై అంతస్తు నుంచి చూస్తూ చిన్నారులను కాపాడేందుకు ఓ మహిళ ప్రయత్నం చేసింది. కానీ కిందకు వచ్చేసరికి ఇద్దరు చిన్నారులు తీవ్రగాయాలతో మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రేయ, పల్లవిలు భవనం టెర్రాస్ పైన ఆడుకుంటున్నారు. ఆ సమయంలో శ్రేయ జారి పడింది. శ్రేయను కాపాడే క్రమంలో పల్లవి ప్రాణాలు కోల్పోయింది.
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications