వివాహేతర సంబంధమే కారణమా?: తల్లిని పొడిచి చంపారు
హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్‌పల్లి సంజీవ్‌నగర్‌లో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కుమారుడే తన పిన్నిని అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా.. ఆమె వేరే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న క్రమంలోనే కుటుంబం పరువు తీస్తోందనే నెపంతో నిందితుడు ఆమెను హత్య చేసినట్లు తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లి సంజీవయ్యనగర్‌కాలనీకి చెందిన జ్యోతి(40) ఎదురింట్లో ఉంటున్న రాజేందర్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఇటీవలే ఇరువురు అత్యంత సన్నిహితంగా ఉండటం జ్యోతి కుమారుడు రాహుల్ చూడటంతో గత మూడు రోజులుగా జ్యోతికి ఆమె కుటుంబసభ్యులకు మధ్య గొడువలు జరుగుతున్నాయి.
ఈ అంశాన్ని జీర్జించుకోలేని జ్యోతి బావ కుమారుడు గణేష్ గురువారం ఉదయం 10 గంటల సమయంలో పిన్ని ఒంటరిగా ఉండటం చూసి ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. అనంతరం నిందితుడు స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా, స్థానికులు జ్యోతిని చికిత్స నిమిత్తం 108 ద్వారా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందింది.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications