పిలిచినా చంద్రబాబుకు మస్కా కొట్టిన టిడిపి ఎమ్మెల్యేలు!
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. టిడిపి ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనుననారని జోరుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు చంద్రబాబుతో భేటీకి డుమ్మా కొట్టారు. పిలిచినప్పటికీ రాకపోవడం చర్చనీయాంశమవుతోంది.
వీరిద్దరు కారు ఎక్కే విషయమై ఊగిసలాడుతున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన మాగంటి, అరికెపూడిలు తెరాసలో చేరే ఆలోచనలో ఉన్నారని, సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది.
సోమవారం పార్టీ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ ఆహ్వానానికి పిలిచినప్పటికీ వీరిద్దరు గైర్హాజరయ్యారు. వీరిద్దరూ పార్టీకి దూరం అవుతున్నారెందుకు ఇదే సంకేతమని అంటున్నారు.
వీరిని చేర్చుకోవాలని తెరాక నేతలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వీరు స్పందించడం లేదని తెలుస్తోంది. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో తెరాస ఘన విజయం అనంతరం వీరు పునరాలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఓటుకు నోటు కేసు విషయంలోను మాగంటి గోపినాథ్ పేరు వినవచ్చిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణలో చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తీగల కృష్ణా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో తెరాసలోకి చేరికలు ప్రారంభమయ్యాయి.

ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు
2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున 15 మంది ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఇప్పుడు ఆ పార్టీకి కేవలం అయిదుగురే మిగిలారు.

ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు
ఇప్పుడు అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్ కూడా కారు ఎక్కుతారనే ప్రచారం సాగుతోంది. ఓటుకు నోటు ఎఫెక్ట్ కారణంగానే మాగంటి తెరాసలో చేరేందుకు సిద్ధమయి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో మాగంటి పేరు వినిపించిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సోమవారం నాడు తెలంగాణ టిడిపి నేతల సమావేశం జరిగింది. దివంగత మాధవ రెడ్డికి చంద్రబాబు నివాళి.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications