జానారెడ్డికే మైక్ ఇస్తున్నారు: ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్య, రేవంత్ ఇల్లు ముట్టడి
కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో మరికొంతమంది సీనియర్లు ఉన్నారని, కానీ కేవలం జానారెడ్డికి మాత్రమే మైక్ ఇస్తున్నారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: స్పీకర్ మదుసూధనా చారిని కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఎం సభ్యులు గురువారం నాడు కలిశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో మరికొంతమంది సీనియర్లు ఉన్నారని, కానీ కేవలం జానారెడ్డికి మాత్రమే మైక్ ఇస్తున్నారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఆయనతో పాటు మమ్మల్నీ గౌరవించాలన్నారు. శాసన సభ వ్యవహాలా మంత్రి ఉన్నది ఎదురు దాడి చేసేందుకా అని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ సభ్యులు పదిహేను మంది అని, కోర్టులో స్పీకర్ అఫిడవిట్ దాఖలు చేశారని, అసెంబ్లీలో టిడిపి సభ్యులు ముగ్గురే అని అంటున్నారని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి అడిగారు. భూసేకరణ బిల్లు పైన తాను మాట్లాడుతుంటే హరీష్ రావుకు మైక్ ఇచ్చారని, ఆ తర్వాత సీఎం మాట్లాడారని, తిరిగి తనకు మైకు ఇవ్వలేదన్నారు. కనీసం నిరసన తెలిపే అవకాశమివ్వరా అన్నారు.

దీని పైన స్పీకర్ మాట్లాడుతూ.. అలా భావిస్తే ఎలాగని ప్రశ్నించారు. అరిచే వారికే మైక్ ఇస్తున్నారని వాళ్లు అంటున్నారని, మైకే ఇవ్వడం లేదని మీరంటున్నారని విపక్షాలతో స్పీకర్ అన్నారు.
రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి
తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి ఇంటిని మాల మహానాడు నేతలు గురువారం ముట్టడించారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన నివాసానికి మాల మహానాడు నేతలు పెద్దఎత్తున చేరుకున్నారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications