కాపు చిచ్చు: చిరంజీవికి విజయశాంతి బాసట
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిపై కత్తులు దూసిన మాజీ పార్లమెంటు సభ్యురాలు, సినీ నటి విజయశాంతి కాపు సమస్యపై ఆయనతో గొంతు కలిపారు.
కాపు రిజర్వేషన్లపై, కమిషన్‌పై చిరంజీవి అభిప్రాయం సరేైందేనని ఆమె సోమవారంనాడు అన్నారు. తెలుగుదేశం, బిజెపి ప్రభుత్వాలు బీసీలకు నష్టం వాటిల్లకుండా కాపుల సమస్యను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.

కాపులను బీసీల్లో చేర్చే విధంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరుతూ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
తూర్పు గోదావరి జిల్లా తుని కాపు ఐక్య గర్జన సందర్భంగా జరిగిన సంఘటనలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపట్టారు.












Click it and Unblock the Notifications