హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తోన్న ప్లీనరీని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఏప్రిల్ 24న నిర్వహించనున్న ప్లీనరీ సమావేశాల కోసం ఎల్బీ స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు.

మరిన్ని ఫోటోలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్లీనరీతోపాటు ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభ కోసం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు.

 ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ఎల్‌బీ స్టేడియం, పరేడ్ గ్రౌండ్‌లలో మంత్రి పద్మారావు నేతృత్వంలో వేదికలను ఏర్పాటు చేస్తున్నారని, ప్లీనరీ ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయని చెప్పారు.

ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ప్లీనరీకి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తల చొప్పున మొత్తం 36వేల నుంచి 40వేల మందివరకు హాజరవుతారని కేటీఆర్ తెలిపారు.

ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ప్ల్లీనరీ సమావేశంలో పార్టీ అధ్యక్షునిగా సీఎం కేసీఆర్‌ను తిరిగి ఎన్నుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పిన ఆయన, ఈ ప్లీనరీలో పార్టీ నాయకుల, కార్యకర్తలు వివిధ అంశాలపై సలహాలు, సూచనలిస్తారని, ప్రభుత్వానికి కూడా తగిన సూచనలు ఇవ్వొచ్చన్నారు.
 ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై తగిన సూచనలను అందిస్తే వాటిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పిన ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరం కలిసి సంబురాలు, విజయోత్సవాలు చేసుకోలేదని, ప్రస్తుతం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగసభతో తెలంగాణ విజయోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు.

 ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ప్లీనరీ, బహిరంగసభలను విజయవంతం చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నామన్నారు. సభలకు వస్తున్న టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల భోజనాలకు నిజాం కాలేజ్ మైదానంలో, పార్కింగ్‌కు వివిధ ప్రాంతాలను పోలీసులు గుర్తించడం జరిగిందన్నారు.

ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

నగర అలంకరణ, పార్కింగ్, భోజనాల ఏర్పాటు, మంచినీళ్ళు, ఎండకాలం నేపథ్యంలో కూలర్స్ ఏర్పాటు వంటి పూర్తి సౌకర్యాలతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు.

ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ఇందుకోసం ప్రత్యేక కమిటీలను వేసి ఏర్పాట్లను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తున్నారని తెలిపారు.

 ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ప్లీనరీతో మా సత్తా చాటుతామని స్పష్ట చేశారం. ఇటీవల నిర్వహించిన పార్టీ సభ్యత్వ కార్యక్రమం టీఆర్‌ఎస్‌ ఓ శక్తిగా ఎదిగిందని, ఇప్పటికే 41లక్షల మంది పార్టీ సభ్యులకు ప్రమాద బీమా చేయించామని చెప్పారు. మిగతావారి డాటా ఎంట్రీ పూర్తికాగానే వారికీ చెల్లిస్తామని కేటీఆర్ చెప్పారు.

 ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

ప్లీనరీ ద్వారా మా సత్తా చాటుతాం: కేటీఆర్

కేటీఆర్ వెంట ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, పార్టీ నేతలు జనార్దన్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతారావు, సామ వెంకట్‌రెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ప్రేమ్‌కుమార్‌ధూత్, సతీశ్‌రెడ్డి, ఆజం అలీ, ఆర్‌వీ మహేందర్, బొంతు రాంమోహన్, కన్నా, బాబా ఫసియొద్దీన్ తదితరులు ఉన్నారు.

English summary
Minister for IT and Panchayat Raj Kalvakuntla Taraka Ramarao here on Tuesday said the TRS, which stormed into power in the newly-formed Telangana State, would show its invincible power to the nation through the 24th plenary of the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X