సతీసమేతంగా అంజనేయుడికి ఆలయం.. తెలంగాణలో ఎక్కడంటే ?
సతీసమేతంగా అంజనేయుడికి ఆలయం అంటే ఆశ్చర్యపోతున్నారా..? మీరు మీరు చదివింది నిజమే. బ్రహ్మచారి అయిన అంజనేయుడికి పురాణాల ప్రకారం వివాహం జరిగింది. సూర్యుడి పుత్రిక సువర్చలను హనుమంతుడు వివాహమాడారు. దేశ వ్యాప్తంగా ప్రసిద్ద అంజనేయ స్వామి ఆలయాలు ఉన్నప్పటికీ.. సతీసమేతంగా ఉన్నవి మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో సైతం సతీసమేతంగా అంజనేయుడిని నిత్యం పూజిస్తున్న ఆలయం ఉంది.
తెలంగాణలో ఎక్కడంటే..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందులో ఉన్న సువర్చల సహిత ఆంజనేయ స్వామి ఆలయం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. సతీసమేతంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలో ఇది ఒక్కటే. భారతీయులలో చాలామందికి ఆంజనేయ స్వామికి భార్య ఉన్నదన్న విషయం తెలియకపోవచ్చు. దాంతో ఈ అరుదైన ఆలయానికి భక్తులే కాకుండా పలువురు ప్రముఖులు, వీఐపీలు కూడా క్యూ కడుతున్నారు. 2006లో ఈ గుడి నిర్మాణం జరిగినట్టు చెబుతున్నారు. ప్రతి ఏడాది వేలాదిగా భక్తులు ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

హనుమంతుడికి భార్యా...? అసలు ఏం జరిగింది?
హనుమంతుడు గురువు సూర్య భగవానుడు. సూర్యుని వద్ద వేదాలు నేర్చుకున్న తరువాత, తొమ్మిది రకాల వ్యాకరణాలు నేర్చుకోవాలన్న కోరిక అంజనేయుడికి కలిగింది. అయితే ఆ కాలంలో ఈ వ్యాకరణాలను పెళ్లైనవారే అభ్యసించాలి అనే నియమం ఉండేది. కానీ హనుమంతుడు బ్రహ్మచారిగా ఉండాలని శపథం చేసినవాడు కావడంతో.. ఈ సంక్లిష్ట పరిస్థితి గురించి త్రిమూర్తులు గమనించి.. సూర్యునికి ఒక ఉపాయం ఇచ్చారు. అప్పుడు సూర్యుడు తన తేజస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టించాడు. తేజస్సు నుంచి ఆమె కలగడంతో సువర్చల అని నామకరణం చేశారు.
ఆ తర్వాత 33 కోట్ల మంది దేవతల సమక్షంలో ఆంజనేయ స్వామికి సువర్చలతో వివాహం చేయించి.. అదే తనకు ఇచ్చే గురుదక్షిణగా భావించారు. ఆ తరువాత హనుమంతుడు వ్యాకరణాలను అభ్యసించి తపస్సుకు వెళ్లిపోతాడు ఆంజనేయుడు. ఈ కథనానికి ఆధారం పరాశర సంహిత. ఇందులో హనుమంతుడు, సువర్చలాదేవి వివాహం జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున జరిగినట్టు స్పష్టంగా ఉంది. అందుకే కొన్ని ఆలయాల్లో ఆ రోజు హనుమంత్ కళ్యాణం కూడా నిర్వహిస్తారు.
ఇతర దేశాల్లో..
ఇక జైన సంప్రదాయం ప్రకారం కూడా హనుమంతుడికి వందమందికి పైగా భార్యలు ఉన్నట్టు చెబుతారు. అందులో రావణాసురుడి చెల్లెలు చంద్రనఖ కూడా ఒకరని అంటారు. అలాగే థాయ్‌లాండ్ విశ్వాసాల ప్రకారం హనుమంతుడు ఒక మత్స్యకన్యతో వివాహం చేసుకుని మకరధ్వజుడు అనే కుమారుడిని పొందాడని విశ్వసిస్తారు. కానీ భారతీయ హిందూ సంప్రదాయం ప్రకారం హనుమంతునికి భార్యగా సువర్చలా దేవి అని నమ్ముతారు.
-
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications