Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జ‌న‌స‌మితి రూట్ ఎటు..? తెలంగాణ‌లో విస్త‌రిస్తుందా..? విస్తుపోతుందా...?

హైద‌రాబాద్ : తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో మంచి గుర్తింపు పొందారు ప్రొపెస‌ర్ కోదండ‌రాం. తెలంగాణ ఆప‌థ‌ర్మ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావుతో కలిసి ఎన్నో ఉద్య‌మాల్లో పాల్గొన్న పాల్గొన్న కోదండ‌రాం., తెలంగాణ సిద్దించిన త‌ర్వాత అదే చంద్ర‌శేఖ‌ర్ రావుతో విభేదించారు. అంత‌టితో స‌రిపెట్టుకోకుండా చంద్ర‌శేఖ‌ర్ రావు ను టార్గెట్ చేసేందుకు రాజ‌కీయ పార్టీని కూడా స్థాపించారు. తెలంగాణ జ‌న‌స‌మితి పేరుతో పార్టీని స్థాపించిన కోదండ‌రాం ప్ర‌భుత్వ విధానాల మీద పోరాటం చేయాల‌ని తిర్మానించుకున్నారు.

తెలంగాణ ప్ర‌జానికానికి, నిరుద్యోగ యువ‌త‌కు, రైతుల‌కు, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు స‌రైన న్యాయం చేయ‌డం లేదంటూ చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంత వ‌ర‌కూ ప‌రిస్థితి బాగానే ఉన్నా ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఎలాంటి వ్యూహంతో ప్ర‌జ‌ల మ‌ద్య‌కు వెళ్తారో అనే అంశం పై సందేహాలు నెల‌కొన్నాయి. తెలంగాణ ముద్దుబిడ్డగా ప్ర‌జాధ‌ర‌ణ ఉన్న‌ప్ప‌టికి అది రాజ‌కీయాల‌కు ఆపాదించుకుంటారా..? లేదా అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నమ‌వుతున్నాయి. స‌హ‌జంగా మ్రుధు,మిత భాషి ఐన కోదండ రాం తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఎలా ఆక‌ర్శాస్తార‌న్న‌ది పాయింట్ గా మారింది.

 కోదండ రాం జ‌న‌స‌మితిని నిల‌బెట్ట‌గ‌ల‌రా..! ప్ర‌భావం ఎంతుండ‌బోతోంద‌నే అంశం పై చ‌ర్చ‌..!

కోదండ రాం జ‌న‌స‌మితిని నిల‌బెట్ట‌గ‌ల‌రా..! ప్ర‌భావం ఎంతుండ‌బోతోంద‌నే అంశం పై చ‌ర్చ‌..!

తెలంగాణలో ముందస్తు సమరం జోరందుకుంది. అధికార - ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఓ జాతీయ పార్టీని మట్టి కరిపించేందుకు పుట్టిన ఓ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు మరో ప్రాంతీయ పార్టీని లేకుండా చేసేందుకు అదే జాతీయ పార్టీతో జత కలుస్తోందని తెలుస్తోంది. ఈ కూటమికి తెలంగాణ ప్రజలు మద్దతు పలుకుతారో? లేక వ్యతిరేకిస్తారో వేచి చూడాల్సిందే. ఈలోగా తెలంగాణలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది? ఏ పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది అన్నది తేలాల్సి ఉంది.

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో తొలి అడుగు...! త‌డ‌బ‌డుతుందా..? ల‌క్ష్యం సాదిస్తుందా..?

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో తొలి అడుగు...! త‌డ‌బ‌డుతుందా..? ల‌క్ష్యం సాదిస్తుందా..?

మరోవైపు ఇంతవరకూ ప్రత్యక్ష రాజకీయాలంటే ఏమిటో తెలియని వారు ఈ సారి ఎన్నికల క్షేత్రంలోకి వస్తున్నారు. వీరు తెలంగాణ ప్రజల మనసు చూరగొంటారా అన్నదే ప్రధాన ప్రశ్నగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీలతోనూ....వివిధ పోరాట రూపాలతోనూ తెలంగాణ ప్రజలకు దగ్గరైన మేథావి - ప్రొఫెసర్‌ కోదండరామ్ తెలంగాణ జన సమితి పేరుతో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారు. మేథావిగా - తెలంగాణ సిద్ధాంత కర్తగా పేరున్న కోదండరాంకు రాజకీయ నాయకుడిగా అంత అనుభవం లేదు. వ్యూహాలు - ప్రతివ్యూహాలు రచించే రాజకీయ చతురత కూడా లేదంటున్నారు.

ఉద్య‌మంలో కేసీఆర్, కోదండ రాం స్నేహితులు..! స్వ‌తంత్ర్య తెలంగాణాలో శ‌త్రువులు..!!

ఉద్య‌మంలో కేసీఆర్, కోదండ రాం స్నేహితులు..! స్వ‌తంత్ర్య తెలంగాణాలో శ‌త్రువులు..!!

అయినా కోదండరాం ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.దీనికి ఏకైక కారణం ప్రభుత్వంపైన, ముఖ్యంగా ప్రభుత్వాధినేత కె.చంద్రశేఖర రావు పైనే ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఉండటమేనట. ఇది వచ్చే ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. రానున్న ఎన్నికల కోసం తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు మహాకూటమిగా ఏర్పాటు అవుతున్నాయి. ఈ కూటమికి కాంగ్రెస్‌ పార్టీ నేత్రత్వం వహిస్తోంది. వారి వారి బలాన్ని బట్టి తెలంగాణలో సీట్ల సర్దుబాటు చేయాలన్నది మహా కూటమి ఉద్దేశ్యం. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న పార్టీలు సాధారణంగానే ఎక్కువ స్ధానాలు కోరుకుంటాయి.

టీఆర్ఎస్ పై ఉన్న వ్య‌తిరేక‌త క‌లిసొస్తుందా..? కోదండ‌రాం ఎన్ని సీట్ల‌లో గెలుస్తారు..?

టీఆర్ఎస్ పై ఉన్న వ్య‌తిరేక‌త క‌లిసొస్తుందా..? కోదండ‌రాం ఎన్ని సీట్ల‌లో గెలుస్తారు..?

అయితే నిన్న - మొన్న పుట్టిన కోదండరాం పార్టీ తెలంగాణ జన సమతి కూడా ఈ ఎన్నికల్లో ఏకంగా 30 నుంచి 40 స్ధానాలు కోరుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇన్ని స్ధానాలు డిమాండ్ చేస్తున్న‌ తెలంగాణ జన సమితికి, ముఖ్యంగా ప్రొఫెసర్‌ కోదండ రామ్‌కు అంత సీన్‌ ఉందా? అని తెలంగాణలోని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉద్యమాలు వేరు, రాజకీయాలు వేరని - ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నవి రాజకీయాలే కాని ఉద్యమం కాదని వారంటున్నారు. దీనిని అనుసరించే తెలంగాణ జన సమితి ముందస్తు ఎన్నికల్లో తమ పాత్ర ఏ మేరకు ఉంటుందో అంచనా వేసుకుని అందుకు తగినట్లుగా వ్యవహరించాలని వారు సలహా ఇస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+