కేటీఆర్‌పై ఓడిన అభ్యర్ధికి టెస్కాబ్ చైర్మన్ పదవి(ఫోటో)
హైదరాబాద్: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన కొండూరి రవీందర్‌రావుకు రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మన్ పదవి దక్కనుంది. నెల రోజులక్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు.
ప్రస్తుతం కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆప్కాబ్ నుంచి విడిపోయి ప్రత్యేకంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్‌బ్యాంక్ (టెస్కాబ్) చైర్మన్ పదవికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.
దీంతో ఆయన ఎన్నికను ఈ నెల 22న లాంఛనంగా ప్రకటించనున్నారు. సోమవారం ఉదయం రవీందర్‌రావు హైదరాబాద్‌లోని టెస్కాబ్ కార్యాలయంలో జాయింట్ రిజిష్ర్టార్ శ్రీనివాసరావుకు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు, పరిగి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్‌రెడ్డి, ఇతర టీఆర్‌ఎస్ నేతలు హాజరయ్యారు.

తెలంగాణలోని ఆరు సహకార బ్యాంకు ఛైర్మన్లు టీఆర్ఎస్‌లో చేరారు. దాంతీ ఈ పదవి టీఆర్ఎస్‌కు దక్కనుంది. ఈ నేపథ్యంలో టెస్కాబ్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే బాధ్యతను కూడా సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్‌రావుపై ఉంచగా, ఆయన సమర్థవంతంగా నిర్వహించారు.
కాగా సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్‌కు ఆయన నియోజక వర్గమైన సిరిసిల్లను 'సుస్ధిరం'గా చేయడంతో భాగంగానే కొండూరి రవీందర్‌రావు ఈ పదవి ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications