Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'కెసిఆర్‌కు చేతకాదని కవిత నిరూపించారు', హైద్రాబాద్‌లో 2 జలాశయాలు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పాలన చేతకాదని ఆయన కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిరూపించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ సోమవారం అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ స్మశానంగా మార్చారన్నారు.

టిఆర్ఎస్ అంటే అబద్దాలు, అహంకారం, అవినీతి అని ఎద్దేవా చేశారు. ఓ పక్క రైతులు ఆత్మహత్య చేసుకుంటూంటే బంగారు బతుకమ్మ అంటూ కవిత ప్రచారం చేయడం ఏమిటన్నారు. 30 ఎకరాల్లో అల్లం పంట కోసం నెలకు పదిసార్లు ఫాంహౌస్‌కు వెళ్లే కెసిఆర్‌కు రైతులను పరామర్శించే తీరిక లేదా అన్నారు.

ఫాంహౌస్‌లో కెసిఆర్ తవ్వించిన బావి కారణంగా సమీప గ్రామాల్లో నీల్లు దొరకకుండా పోయాయన్నారు. అలాగే ఉద్యోగులకు పిఆర్సీ, హెల్త్ కార్డులు ఇస్తే చాలా, రైతుల సమస్యలు అవసరం లేదా అని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను నిలదీశారు.

'Why KCR not not visitng farmers residence?'

కవిత బతుకమ్మ కుంట వైపు చూడాలి: విహెచ్

బతుకమ్మ అంటూ వేడుకలు నిర్వహిస్తున్న కవిత.. అంబర్ పేటలోని బతుకమ్మ కుంట వైపు చూడాలని వి హనుమంత రావు అన్నారు. బతుకమ్మ కుంటను చెరువులా మార్చాలన్నారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ

క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కలిశారు. ఈ నెల 23న జలవిహార్‌లో నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి సీఎంను దత్తాత్రేయ ఆహ్వానించారు. అలయ్ బలయ్‌కి హాజరయ్యేందుకు సీఎం సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తుంటారు.

'Why KCR not not visitng farmers residence?'

హైదరాబాద్‌కు రెండు జలాశయాలు నిర్మిస్తాం: కేసీఆర్‌

హైదరాబాద్‌ మహానగరానికి రెండు జలాశయాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మంచినీరు, డ్రైనేజీ, రహదారుల నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు అందేలా కార్యచరణ రూపొందించాలన్నారు. నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణాల్లో బలహీన వర్గాల్లో గృహ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలన్నారు. హైదరాబాద్ నగర మంచినీటి అవసరాల కోసమే రెండు జలాశయాలను నిర్మిస్తామన్నారు. ప్రతీ ఇంటికి మంచినీటిని అందించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అక్రమ నిర్మాణాలు, కట్టడాల నియంత్రణకు కృషి చేస్తామన్నారు. పట్టణాల్లో బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+