అంతా వ్యూహాత్మకమేనా: రేవంత్ రెడ్డిపై పీసీ యాక్ట్ ఎందుకు?

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి పైన నమోదు చేసిన సెక్షన్లు సరైనవేనా? అనే చర్చ న్యాయవర్గాల్లో సాగుతున్నాయని అంటున్నారు. కేసులో సెక్షన్లు సరైనవేనా అనే చర్చ కూడా సాగుతోందని అంటున్నారు.

ఈ వ్యవహారంలో రేవంత్ పైన ఏసీబీ కేసు నమోదు చేయవచ్చా? ఆయన పైన పెట్టిన సెక్షన్లు సరైనవేనా? అనే చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంలో ఏసీబీ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కింద కేసు నమోదు చేసింది.

అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) పబ్లిక్ సర్వెంట్లకు సంబంధించినది. రేవంత్ ఎమ్మెల్యే. కాబట్టి ఆయన పబ్లిక్ సర్వెంట్లన్న నిర్వచనం పరిధిలోకి వస్తారనే ఏసీబీ ఈ చట్టాన్ని ప్రయోగించారని చెబుతున్నారు. ఈ చట్టం ప్రకారం నేరం చేస్తే ఆరు నెలల నుండి ఐదేళ్ల వరకు శిక్ష పడుతుంది.

Why PC act on Revanth Reddy?

తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇతరులకు లబ్ధి చేకూర్చడం కోసం లంచం, నజరానాలు అడిగినా, తీసుకున్నా, అంగీకరించినా అది శిక్షార్హం. అయితే, రేవంత్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరికో ప్రయోజనం చేకూర్చేలా లంచం తీసుకోలేదు. ఆయన ఏ అధికార హోదాలో లేరు. దీంతో, ఆయనకు ఈ చట్టంలోని సెక్షన్లు వర్తించవని కొందరు చెబుతున్నారని అంటున్నారు.

రేవంత్ ఓటు కోసం స్టీఫెన్ సన్‌కు డబ్బు ఆఫర్ చేసినట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఇది అధికార దుర్వినియోగం కాదని, లంచం అని అంటున్నారు. ఇలా ప్రలోభ పెట్టడం ప్రజాప్రాతినిథ్య చట్టం, ఐపీసీల కింద శిక్షార్హమే కానీ అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే అది బెయిలబుల్ అవుతుందని, శిక్ష కూడా ఏడాది లోపే ఉంటుందని, ఒకవేళ ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే అధి అభ్యర్థఇ అనర్హతకు సంబంధఇంచిన అంశంగా మారి హైకోర్టు విచారణలో నిగ్గు తేలాల్సి ఉంటుందని, వీటిని పరిగణలోకి తీసుకొని రేవంత్ పైన ఏసీబీ పీసీ యాక్ట్ ప్రయోగించి ఉంటుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+