రాజ్యసభ ఎన్నికల్లో ఏం చేద్దాం: బీజేపీ నేతల తర్జన భర్జన
హైదరాబాద్: రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనే విషయమై తెలంగాణ బీజేపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. మూడు ఖాళీలు ఉండగా నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మూడు స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు ఆరుగురు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని బరిలో దించడంతో ఎన్నిక అనివార్యమైంది.

తెలంగాణలో బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు ఎవరికి ఓటు వేయలానే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. అయితే అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించారు.
బీజేపీ అధికార టీఆర్ఎస్‌కు మద్దతిచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. బీజేపీ మద్దతిచ్చినా లేకున్నా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశముంది. అయితే ఇతర పార్టీల నుంచి చేరిన వారు కనుక క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితేనే ఇబ్బందులు వస్తాయి.












Click it and Unblock the Notifications