కట్టర్‌తో గొంతుకోసేశాడు..: పట్టపగలే యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది!

హైదరాబాద్: ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలైపోయింది. ప్రేమ పేరుతో ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేసిన ఓ యువకుడు.. చివరకు నిర్దాక్షిణ్యంగా ఆమె ప్రాణాలు తీశాడు. పట్టపగలు జ్యువెలరీ షాపులోకి చొరబడి మరీ ఆమె గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. బతుకుదెరువు కోసం నగరానికి వస్తే.. తమ కుమార్తె ఇలా బలైపోవడం ఆ తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది.

 అసలేమైంది?:

అసలేమైంది?:

తూర్పుగోదావరి జిల్లా రావులపాలానికి చెందిన అగ్గిరాముడు, అన్నపూర్ణలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అగ్గిరాముడు మధురానగర్‌లో ఇస్త్రీ షాపు నడుపుతూనే మరో ఇంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. జవహర్‌నగర్‌లో వీరి కుటుంబం అద్దెకు ఉంటోంది.

చిన్న కుమార్తె వెంకటలక్ష్మి..:

చిన్న కుమార్తె వెంకటలక్ష్మి..:

అగ్గిరాముడు, అన్నపూర్ణల చిన్నకుమార్తె వెంకటలక్ష్మి(19) స్థానిక జోడి ఫ్యాషన్‌ జ్యువెలరీస్‌ వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ స్టోర్స్‌లో పని చేస్తోంది. ఏడో తరగతి వరకు చదివిన వెంకటలక్ష్మి.. ఆపై చదువును కొనసాగించలేదు. కొన్నాళ్లు స్థానిక ఇళ్లలో పని చేసిన తర్వాత.. జ్యువెలరీ షాపులో పనికి కుదిరింది. నాలుగు రోజుల క్రితం షాపు యజమాని జ్యోత్స్న వేరే ఊరికి వెళ్లడంతో వెంకటలక్ష్మి షాపును చూసుకుంటోంది.

మధ్యాహ్నాం 3.30గం. సమయంలో:

మధ్యాహ్నాం 3.30గం. సమయంలో:

యథావిధిగా సోమవారం కూడా స్టోర్స్‌ తెరిచిన వెంకటలక్ష్మి మధ్యాహ్నాం పూట కంగారుగా యజమానురాలికి ఫోన్ చేసింది. షాపు ఎదుట ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, తనను వేధిస్తున్నారని వాపోయింది.
అయినప్పటికీ ధైర్యం కూడదీసుకుని షాపులోనే ఉండిపోయింది వెంకటలక్ష్మి. కానీ మధ్యాహ్నాం 3.30గం. సమయంలో ఆ అనుమానాస్పద వ్యక్తుల్లో ఒకడు నేరుగా షాపులోకి చొరబడ్డాడు.షాపులో ఉన్న బంగారు నగలు కట్‌ చేసే కట్టర్‌తో వెంకటలక్ష్మిపై దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంకటలక్ష్మి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది.

ఆర్నెళ్లుగా వేధింపులు:

ఆర్నెళ్లుగా వేధింపులు:

సాగర్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా యువతిని వేధిస్తున్నాడని, ఆమె ప్రేమను నిరాకరించిన కారణంగానే హత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గతంలో సాగర్ తనను వేధించినట్టు యువతి తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పిందన్నారు. ముందస్తు పథకం ప్రకారమే.. నాలుగైదు రోజుల నుంచి సాగర్ ఆమెను వెంటాడుతున్నాడని, ఇదే క్రమంలో హత్యకు పాల్పడ్డాడని అన్నారు. హత్యలో సాగర్ కు మరో ఇద్దరు సహకరించినట్టు తెలిపారు. మధ్యాహ్నాం సమయంలో అయితే షాపులో ఎవరూ ఉండరన్న ఉద్దేశంతోనే ఆ సమయంలో హత్య చేసినట్టు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+