అక్క భర్తతో సహజీవనం: బావ తిట్టాడని యువతి ఆత్మహత్య
హైదరాబాద్: బావ తిట్టాడని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నరసింహ మేస్త్రీగా పని చేస్తున్నాడు. భార్య దేవమ్మతో కలిసి బంజారాహిల్స్ ప్రాంతంలో ఉంటున్నాడు.
గత పదహారేళ్లుగా భార్య దేవమ్మ చెల్లెలు సునీత (26) కూడా వీరితోనే ఉంటోంది. ఇంటర్ చదువుకుంది. సునీతతో కూడా నరసింహ సహజీవనం చేస్తున్నాడు. వీరి మధ్య తరుచూ గొడవ జరిగేది. మంగళవారం రాత్రి నరసింహ మద్యం సేవించి ఇంటికి రాగా, అద్దె చెల్లించేందుకు డబ్బుల్లేవని గొడవ చేశాడు. సునీత మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది.

సునీత చదువుకోవడానికి అక్క ఇంటికి పదహారేళ్ల క్రితం వచ్చింది. ఆ తర్వాత బావతోనే సహజీవనం చేసింది. ఈ విషయం అందరికీ తెలిసింది. దీంతో పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. నరసింహులు మంగళవారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మత్తులో బజ్జీలు తేవాలని అక్కడే ఉన్న సునీతకు సూచించాడు. వెళ్లకపోవడంతో అతనే వెళ్లి తెచ్చుకున్నాడు.
ఇంటి అద్దె కట్టేందుకు డబ్బులు లేవని, ఇలాంటి సమయంలో మద్యం, బజ్జీలు తెచ్చుకుంటావా అని సునీత గొడవ పడింది. వారు గొడవ పడిన సమయంలో ఇంట్లో నరసింహులు భార్య ( సునీత అక్క), కుమారుడు ఇంట్లో లేరు. గొడవ పెద్దది అయింది. ఆ తర్వాత సునీత కొక్కేనికి చీరతో ఉరివేసుకుంది.
ఇది గమనించిన నరసింహులు కూతురు పక్కన ఇళ్ల వారికి విషయం చెప్పింది. చుట్టుపక్కల వారు వచ్చి కిటికీలోంచి లోపలికి ప్రవేశించి కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే సునీత ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నరసింహులు కుమార్తె దేవమ్మ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. పోలీసులు నరసింహులును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications