నా భర్తతో సంబంధం: మహిళను వివస్త్రను చేసి హింస
హైదరాబాద్: తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి ఓ మహిళను మరో మహిళ బంధించి, దాడి చేసిన సంఘటన హైదరాబాదులోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగు చూసింది. కిస్మత్ పురకు చెందిన సుధాకర్ స్థానిక మహిళ నుండి రూ.5వేలు అప్పు తీసుకున్నాడు.
ఆమెకు డబ్బును ఎంతకూ తిరిగివ్వలేదు. ఆమెకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. అప్పు ఇచ్చిన మహిళ సుధాకర్‌కు గత కొద్ది రోజులుగా ప్రతి రోజు ఫోన్ చేస్తోంది. తన డబ్బు ఇవ్వాలని అడిగింది. అయితే, తన భర్తకు మహిళ నుండి నిత్యం ఫోన్లు వస్తుండటంతో.. సుధాకర్ భార్యకు అనుమానం వచ్చింది.

ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానించి.. మరో ముగ్గురు మహిళలను తీసుకెళ్లి.. తన భర్తకు అప్పు ఇచ్చిన మహిళను అడ్డగించి వాహనంలో ఎక్కించుకుంది.
ఆమెను తన ఇంట్లోని రహస్య గదిలో బంధించి.. వివస్త్రను చేసి మర్మాంగాల పైన జిల్లేడు పాలు పోసి హింసించింది. ఆమె నుండి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications