మహిళపై రేప్, ఆపై హత్య: అదృశ్యమై కారులో శవమై తేలాడు
హైదరాబాద్: గుర్తుతెలియని మహిళపై అత్యాచారం చేసిన దుండగులు ఆ తర్వాత ఆమెను హత్య చేసి పరారయ్యారు. సహారా ఎస్టేట్స్ వెనుక భాగంలో ఉన్న ఓ ఖాళీ స్థలంలో గది నిర్మించి ఉంది. ఆ గదిలో ఓ మహిళ(35) నిర్జీవంగా పడి ఉండటాన్ని ఆదివారం సాయంత్రం వాకింగ్ చేస్తూ అటువైపు వెళ్లిన వారు గమనించారు. విషయాన్ని ఎల్‌బీనగర్ పోలీసులకు చెప్పటంతో వారు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు.
మహిళపై అత్యాచారం చేసిన దుండగులు ఆ తరువాత హత్య చేసినట్టు గుర్తించారు. మృతురాలికి సంబంధించిన విషయాలు తెలియ రాలేదని తెలిపారు. ఆమె చేతిపై పేరుతో పచ్చబొట్టు రాసి ఉన్నట్టు గుర్తించారు. హతురాలు ఎవరు, ఆమెను ఎవరు చంపారనే దానిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్య శనివారం రాత్రి జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇదిలావుంటే, అదృశ్యమైన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. హైదరాబాదులోని అంబర్‌పేట ఎస్సై అమ్జద్ తెలిపిన వివరాల ప్రకారం...డీడీకాలనీకి చెందిన మల్లారెడ్డి కుమారుడు మహేశ్వర్‌రెడ్డి(33)కి మాటలు రావు. తాను మాట్లాడకపోవడంతో ఏదైనా చెప్పాలంటే సెల్‌లో మెసేజ్ ఇవ్వడం, వాట్సాప్ చేయడం ద్వారా ఇతరులకు తెలియజేస్తుంటాడు. తన తల్లిదండ్రులకు కూడా ఇలానే చెప్తుంటాడు.
శనివారం మధ్యాహ్నం కారులో సోమాజిగూడలో ఉన్న తన బాబాయ్ ఆఫీసుకు వెళ్తానని చెప్పి వెళ్లాడు. తిరిగి రాలేదు. తండ్రి మల్లారెడ్డి అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆదివారం ఉదయం శ్రీశైలం రూట్లో మహేశ్వరం పీఎస్ పరిధిలోని తుమ్ములూరు ఔటర్ రింగ్ రోడ్డుకు పది కిలోమీటర్ల దూరంలో కారులో అతను శవమై కన్పించాడు. కేసు దర్యాప్తులో ఉంది.












Click it and Unblock the Notifications