కారులో తిప్పుతూ నాలుగు రోజులు అత్యాచారం!

హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ఓ మహిళ పైన గుర్తు తెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివాహితను కత్తితో బెదిరించి, ఆమె పైన దాడి చేసి బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. నాలుగు రోజులుగా కారులో తిప్పుతూ తన పైన లైంగిక వైధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆమెను చికిత్స నిమిత్సం ఆసుపత్రికి తరలించారు.

woman raped in Warangal district

అనాథ బాలికను విక్రయించే యత్నం

నిజామాబాద్‌ జిల్లా లింగంపేటకు చెందిన పుప్పరి స్వాతి (14) అనే అనాథ బాలికను మెదక్‌ జిల్లాకు చెందిన చింతల రవి పటాన్‌చెరువు వద్ద విక్రయించేందుకు ప్రయత్నించగా ఆ బాలిక తప్పించుకొంది. ఆమెను ఆదివారం స్మైల్‌కేర్‌ పోలీసుల సహకారంతో ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు.

తల్లిద్రండులు మృతిచెందిన స్వాతి సంగారెడ్డిలోని బాలసదన్‌లో ఉంటోంది. స్వాతి తండ్రి పేరుమీద రూ.లక్షా 5వేల ఇన్సూరెన్స్‌ డబ్బులు మంజూరైనట్లు తెలుసుకున్న రవి నెల రోజుల క్రితం బాలసదన్‌కు వచ్చి బాలికను లింగంపేట తీసుకువచ్చాడు. బాలిక సంరక్షకుడిగా ధ్రువపత్రాలను సృష్టించి డబ్బులను పొందేందుకు యత్నించాడు.

బంధువుల వద్దకు తీసుకెళతానని చెప్పి బాలికను రవి ఈనెల 8న పటాన్‌చెరుకు తీసుకెళ్లాడు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో తన వద్ద ఒక అమ్మాయి ఉందని, రూ.2లక్షలకు విక్రయిస్తానని మాట్లాడుతుండగా విన్న బాలిక అతడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తప్పించుకుంది.

సహకార బ్యాంకులో చోరీకి విఫలయత్నం

రంగారెడ్డి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఇబ్రహీంపట్నం శాఖలో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. పోలీసుల గమనించడంతో వెంట తెచ్చిన ఇన్నోవాను వదిలి పరారయ్యారు. బ్యాంకు కిటికీ గ్రిల్‌ను తొలగించి లోనికి ప్రవేశించారు. సీసీ కెమెరాలు, విద్యుత్‌ అలారం కనెక్షన్లను తొలగించారు.

అదే సమయంలో బీట్‌ డ్యూటీ కానిస్టేబుళ్లు రామకృష్ణ, భీమాగ్రిలు బ్యాంకు బయట అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని నిలిపి ప్రశ్రించారు. అతను సమాధానం ఇవ్వకుండా పరుగు లంగించాడు. విషయాన్ని గమనించి బ్యాంకులోకి చొరబడ్డ దొంగలు కేడా పరారయ్యారు. రెండు సిలిండర్లు, కట్టర్లు అక్కడే వదిలి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+