మాధవి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద వైద్యులు: తల్లి, తమ్ముడిని చూడాలని..
హైదరాబాద్: వేరే కులానికి చెందిన యువకుడ్ని ప్రేమ వివాహం చేసుకుని తండ్రి చేతిలో బుధవారం దాడికి గురై.. ప్రాణాలతో పోరాడుతున్న మాధవి హెల్త్ బులిటెన్‌ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. గురువారం వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. మాధవి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు.
మరో 48 గంటల తర్వాత జనరల్ వార్డుకు తరలిస్తామని తెలిపారు. తండ్రి ఇంత దారుణంగా దాడి చేయడంతో ఆమె తీవ్ర షాక్‌కు గురైందన్నారు. తన తల్లి.. తమ్ముడిని చూడాలని కోరిందని చెప్పారు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండటంతో ఎక్కువ మందిని చూడటానికి అనుమతిని ఇవ్వటంలేదని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

దాడికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్‌లు వారం రోజుల క్రితం ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి మనోహరాచారి.. కొత్తబట్టలు పెడతానని నమ్మించి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ముందుగా సందీప్‌పై దాడి చేశాడు.
ఆ తర్వాత మాధవి అడ్డుకోవడంతో ఆమెను విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో మాధవికి తీవ్రగాయాలయ్యాయి. ఓ చేయికి లోతుగా కత్తి గాటు పడింది. మెడపై దాడి చేయడంతో కొన్ని నరాలు ఛిద్రమైనట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం కోరుకుంటోందని తాజాగా వైద్యులు తెలిపారు.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications