షర్మిలను ఫిక్స్ చేసిన రేవంత్, డీకేశీ రాయబారం - ఢిల్లీలో పంచాయితీ..!

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ రాజకీయంలో చిక్కుకున్నారా. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం లేదా పొత్తు దిశగా నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో షర్మిల అనుకున్నది ఒకటి..అయింది మరొకటిగా పరిస్థితి మారింది. షర్మిల కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఎపిసోడ్ లో రేవంత్ రాజకీయంపై చర్చ సాగుతోంది. షర్మిల తెలంగాణలో కాదు..ఏపీలో పోటీ చేస్తారనే ప్రచారం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో షర్మిల ఢిల్లీ యాత్రకు సిద్దమయ్యారు.

కాంగ్రెస్ వైపు షర్మిల అడుగులు : తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ వైఎస్ షర్మిల పార్టీ స్థాపించారు. సుదీర్ఘ పాదయాత్ర చేసారు. బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకున్నారు. దీక్షలు కొనసాగించారు. కానీ ఆశించిన స్థాయిలో రాజకీయంగా స్పందన రాలేదు. మద్దతు దొరకలేదు. ఈ సమయంలోనే కాంగ్రెస్ నుంచి షర్మిలకు ఆఫర్ వచ్చింది. డీకే శివకుమార్ చొరవ తీసుకున్నారు. ప్రియాంక గాంధీ ను షర్మిలతో మాట్లాడించారు.

sharmilarevanthreddydkshivakumar

కాంగ్రెస్ లో విలీనం కావాలని..రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారని సమాచారం. ఆప్పట్లో షర్మిల ప్రతిపాదన పరోక్షంగా అవునని చెబుతూనే...పొత్తు అనేది రేపటి నిర్ణయమంటూ దాటేసారు. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకొనే సమయం వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ సైతం అదే చెప్పారు. షర్మిలతో కాంగ్రెస్ అధినాయకత్వం టచ్ లో ఉందని నిర్దారించారు.

రేవంత్ కు ఆమోదం కాదా : షర్మిలకు తెలంగాణకు మాత్రమే పరిమితం కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ తో పొత్తు ద్వారా తెలంగాణలో పరస్పరం సహకరించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోది. షర్మిల ఎంట్రీని తొలి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యతిరేకిస్తున్నట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది. షర్మిల పార్టీలోకి రావటం ద్వారా కొత్త సమస్యలు రావటం.. మరో పవర్ సెంటర్ గా మారటం..బీఆర్ఎస్ కు కొత్త ఆయుధంగా మారుతుందని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దీనికి కొనసాగింపుగా షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తున్నారని.. ఏపీ నుంచి పోటీ చేయబోతున్నారంటూ రేవంత్ మద్దతు దారులు వ్యూహాత్మకంగానే షర్మిల ను ఫిక్స్ చేసే విధంగా ప్రచారంలోకి తీసుకొచ్చారని షర్మిల అనుచరులు భావిస్తున్నారు. దీని పైన షర్మిల వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన భవిష్యత్తు తెలంగాణతో అని తేల్చి చెప్పారు.

 sharmiladkshivakumar

ఢిల్లీకి షర్మిల : ఈ వివరణలో అసలు ఏపీలో జోక్యం చేసుకొనే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సమయంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో షర్మిల మంతనాలు సాగించారు. పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని విలీనం దిశగా ఆలోచన చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. షర్మిల పొత్తుకు సుముఖంగా ఉన్నా.. విలీనం కు సిద్దంగా లేరని చెబుతున్నారు. షర్మిల కొన్ని షరుతులను తెర మీదకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

షర్మిల ప్రతిపాదనల పైనే నేరుగా ఢిల్లీలోని అగ్రనాయకత్వంతో చర్చించి..అక్కడే హామీ దక్కేలా డీకేశీ అంతా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. దంతో..షర్మిల ఢిల్లీ యాత్రకు సిద్దం అవుతున్నారు. అక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చల తరువాత తన రాజకీయ నిర్ణయం ప్రకటించాలని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+