జగన్ సర్కార్‌కు కేంద్రం మరో తీపి కబురు- తిరుపతికి భారీ ప్రాజెక్ట్‌ మంజూరు

తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి.. కేంద్రం మరో తీపి కబురు వినిపించింది. రెవెన్యూ లోటు బడ్జెట్, పోలవరం ప్రాజెక్ట్ నిధులను మంజూరు చేసిన కేంద్రం- తాజాగా ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్‌ను మంజూరు చేసింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్‌ను రాష్ట్రానికి మంజూరు చేసింది కేంద్రం. ఇది తిరుపతిలో ఏర్పాటు కానుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చేసిన సిఫారసులకు కేంద్రం అనుమతి తెలిపింది. పరిపాలన అనుమతులను కూడా జారీ చేసింది. తొలిదశలో 6.42 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేసింది.

YS Jagan

నాగాలాండ్ రాజధాని కోహిమాలోని ఎన్‌ఐఈఎల్‌ఐటీని ఇంప్లిమెంట్ ఏజెన్సీగా అపాయింట్ చేసింది. తిరుపతిలో రూపుదిద్దుకోనున్న ఈ సెంటర్ నిర్మాణ బాధ్యతలు, ఇతర కార్యకలాపాలన్నింటినీ కూడా కోహిమా సెంటర్ పర్యవేక్షిస్తుంది. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో ఇది ఏర్పాటు కానుంది. ఈ సెంటర్ వల్ల యువతకు సమాచార సాంకేతికత, దాని అనుబంధ రంగాల్లో నాణ్యమైన విద్యను అందింవచ్చు.

సంవత్సరానికి సుమారు 1,000 మంది విద్యార్థులకు ఇందులో శిక్షణ ఇచ్చే సదుపాయం ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 47 ఎన్ఐఈఎల్‌ఐటీ కేంద్రాలు ఉన్నాయి. ఏపీకి ఈ ప్రాజెక్ట్ మంజూరు కావడం ఇదే తొలిసారి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ వంటి కీలక రంగాల్లో అందించడానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుంది.

NIELIT

తిరుపతిలో ఈ సెంటర్‌ను నెలకొల్పాలంటూ వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక లోక్‌సభ సభ్యుడు డాక్టర్ ఎం గురుమూర్తి కొంతకాలంగా ప్రయత్నాలు సాగించారు. ఎట్టకేలకు అవి ఫలించాయి. ఎలక్ట్రానిక్స్ డిజైన్, టెక్నాలజీ, ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉన్నత స్థాయి విద్యను అభ్యసించడానికి రాష్ట్ర విద్యార్థులకు ఇది దోహదపడుతుందని గురుమూర్తి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+