3 గంటలు..2.4 లక్షలు: రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన తిరుమల లడ్డూలు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన లడ్డూలను ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లాల్లో అమ్మకాలను ప్రారంభించింది. అమ్మకాలు ప్రారంభించిన మూడు గంటల్లోనే రికార్డు స్థాయిలో 2.4 లక్షల లడ్డూలు అమ్ముడుపోయాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో గత మూడు నెలల నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల దర్శనంకు మూసివేయడం జరిగింది. అయితే ఇక లడ్డూలను మాత్రం భక్తులకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించిన నేపథ్యంలో సోమవారం నుంచి లడ్డూలను ఆయా జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇతర కళ్యాణ మండపాల్లో టీటీడీ అమ్మకానికి ఉంచింది. ఇక లడ్డూలను ఆన్‌లైన్ ద్వారా కూడా విక్రయిస్తామని టీటీడీ తెలింపింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వారు దగ్గరలోని టీటీడీ సమాచార కేంద్రంనుంచి లేదా టీటీడీ కళ్యాణ మండపం నుంచి తీసుకోవచ్చని పేర్కొంది.

గుంటూరు మినహా అన్ని జిల్లాల్లో...
ఇక టీటీడీ అమ్మకానికి పెట్టిన లడ్డూలను గుంటూరు జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో పెట్టింది. ఈ నెల 30 నుంచి గుంటూరులో కూడా లడ్డూలను అమ్మకానికి పెడతామని టీటీడీ వివరించింది. లడ్డూలు తమ రాష్ట్రాల్లో కూడా విక్రయించాలని ఇప్పటికే డిమాండ్ ఊపందుకుంటోంది. లడ్డూలు తమ రాష్ట్రాల్లో విక్రయించాలని తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇక పెద్ద ఎత్తున లడ్డూలకు డిమాండ్ రావడంతో అక్కడ కూడా త్వరలో విక్రయిస్తామని ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ వివరించింది.

ఆర్డర్ పై పెద్ద మొత్తంలో లడ్డూలు...
ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో తిరుమల లడ్డూను డిస్కౌంట్‌తో అమ్మాలని టీటీడీ ఇప్పటికే డిసైడ్ అయిన నేపథ్యంలో రూ.50గా ఉన్న లడ్డూను ఇప్పుడు రూ. 25కే విక్రయిస్తోంది. ఇది లాక్‌డౌన్ ఎత్తివేసే వరకు ఈ రేటుతోనే లడ్డూల విక్రయం జరుగుతుందని టీటీడీ స్పష్టం చేసింది. ఇక పెద్ద మొత్తంలో వచ్చే లడ్డూ ఆర్డర్లపై కూడా కసరత్తు చేస్తోంది టీటీడీ. ఒక్కసారి లడ్డూలు పెద్ద సంఖ్యలో చేస్తే దగ్గరలోని సమాచార కేంద్రాలకు లేదా కళ్యాణ మంటపాలకు రవాణా చేస్తామని టీటీడీ స్పష్టం చేసింది.
Recommended Video

ఆన్‌లైన్‌లో బల్క్ మొత్తంలో లడ్డూలు
పెద్ద మొత్తంలో లడ్డూలు కావాలనుకునే వారు శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓను ఫోనుపై సంప్రదించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఫోన్ నెంబరు కూడా టీటీడీ ఇచ్చింది. ఈ మొబైల్ నెంబర్ 9849575952కు ఫోన్ చేసి తమకు కావాల్సిన ఆర్డర్ చెప్పొచ్చిన వెల్లడించింది. అయితే కేవలం ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే లడ్డూలను తయారు చేయడం జరుగుతుందని టీటీడీ వెల్లడించింది. ఇక 1000 లడ్డూల కంటే ఎక్కువగా కావాలనుకునే వారు తమ పేరు, మొబైల్‌నెంబర్ ఇతర వివరాలను ఐదురోజుల ముందే సబ్మిట్ చేయాలని టీటీడీ స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను భక్తుల ఈమెయిల్ ఐడీకి పంపడం జరుగుతుందని చెప్పింది. పెద్ద మొత్తంలో లడ్డూలు కావాలనుకునే వారు ఈ ఈ-మెయిల్ ఐడీకి తమ వివరాలు సబ్మిట్ చేయాలని పేర్కొంది: [email protected]. మరిన్ని వివరాలకు భక్తులు టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చిన టీటీడీ పేర్కొంది. పూర్తి వివరాలకు :
18004254141; 1800425333333 ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయాలని టీటీడీ వెల్లడించింది.
-
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications