శ్రీవారి భక్తులకు అలెర్ట్ - అందుబాటులో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు : ఇలా పొందండి..!!
శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శానికి టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. కాసేపట్లో టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 2 నుంచి 11 వ తేదీకి సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేసింది. రోజుకి 20 వేల చొప్పున టికెట్లను టీటీడీ అందుబాటులోకి తెచ్చారు.జనవరి 2 నుంచి 11 వ తేదీకి సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు భక్తులకు అందుబాటులో తీసుకొచ్చారు.
జనవరి 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ రోజు ప్రారంభించే ఆన్ లైన్ టికెట్లను 11వ తేదీ వరకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇక, జనవరి 1వ తేదీ నుంచి సంక్రాంతి వరకు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో, టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ లేఖలను ఈ మధ్య కాలంలో అనుమతించకూడదని నిర్ణయించారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉండే రద్దీ కారణంగా రాజ్యాంగ హోదాలో వీఐపీలు స్వయంగా వస్తే మాత్రమే బ్రేక్ దర్శనం కేటాయించనున్నారు.

సాధారణ భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం రోజుల్లో ప్రాధాన్యత ఇచ్చేందు.. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను రద్దు చేసారు. జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి ఉత్సవాలు జరగనున్నాయి. కాగా టికెట్లు పొందిన వారిని మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది.
శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300/- దర్శన టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం ఉంటుంది. మరోవైపు 2023 నకు సంబంధించి టీటీడీ ముద్రించిన క్యాలండర్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విడుదల చేశారు. ఈ క్యాలండర్లు తిరుమల,తిరుపతిలో భక్తులకు అందుబాటులో వచ్చాయి.












Click it and Unblock the Notifications