జ‌గ‌న్ సాక్షిగా అంటూ ఎమ్మెల్యే ప్ర‌మాణం: కోటంరెడ్డి రెండు సార్లు: బాల‌య్య‌తో వైసీపీ ఎమ్మెల్యేలు..!

అసెంబ్లీ స‌మావేశాల తొలి రోజున ఆసక్తి క‌ర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేల ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో అధినేతల మీద భ‌క్తి చాటుకున్నారు. ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు ఆంగ్లంలొ ప్ర‌మాణ స్వీకారం చేసారు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేల బాల‌కృష్ణ‌తో క‌ర‌చాల‌నం చేయ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి రెండు సార్లు ప్ర‌మాణ స్వీకారం చేయాల్సి వ‌చ్చింది. మొత్తం 173 మంది ఎమ్మెల్యేలు త‌మ ప్రమాణ స్వీకారం స‌భ‌లో పూర్తి చేసారు.

జ‌గ‌న్ సాక్షిగా అంటూ వైసీపీ ఎమ్మెల్యే..

ఎమ్మెల్యేలు ఏపీ శాస‌న‌స‌భ‌లో ప్ర‌మాణ స్వీకారం చేసారు. వారిలో వైసీపీ అభ్య‌ర్దులు ప్ర‌మాణ స్వీకారానికి ముందుగా త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు అభివాదం చేసి ప్ర‌మాణ స్వీకారం కొన‌సాగించారు. అదే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది త‌మ అధినేత చంద్ర‌బాబుకు స‌భ‌లోనే పాదాభివంద‌నం చేసి..ప్ర‌మాణ స్వీకారం చేసారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న ప్ర‌మాణ స్వీకారం ముగిసిన త‌రువాత ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుతో స‌హా విప‌క్ష ఎమ్మెల్యేల‌కు అభివాదం చేసారు. చంద్ర‌బాబు సైతం ఆయ‌న‌కు ప్ర‌తి న‌మ‌స్కారం చేసారు. ఇక‌, చంద్ర‌బాబు త‌న ప్ర‌మాణ స్వీకారం చేసి ప్రొటెం స్పీక‌ర్ వ‌ద్ద‌కు వెళ్లే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రికి అభివాదం చేసారు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి త‌న ప్రమాణ స్వీకార వేళ త‌మ అధినేత మీద భ‌క్తి చాటుకున్నారు. వైయ‌స్‌జ‌గ‌న్ సాక్షిగా అంటూ ప్ర‌మాణం చేయ‌టంతో స‌భ‌లో ఒక్కసారిగా అంద‌రి దృష్టి ఆయ‌న వైపు మ‌ళ్లింది.

కోటంరెడ్డి రెండు సార్లు ప్ర‌మాణం..

నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కోటం రెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి రెండు సార్లు ప్ర‌మాణ స్వీకా రం చేయాల్సి వ‌చ్చింది. ఆయ‌న త‌న ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో వైయ‌స్ జ‌గ‌న్ సాక్షిగా అంటూ ప్ర‌మాణం చేసారు.
దీనిని గ‌మ‌నించిన ప్రొటెం స్పీక‌ర్ శంబంగి చిన అప్ప‌ల‌నాయుడు అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. దైవ సాక్షిగా..లేదంటే మ‌న‌సాక్షిగా మిన‌హా మ‌రెవి పేర్లు ప్ర‌స్తావించ‌రాద‌ని అధికారులు స్ప‌ష్టం చేసారు. దీంతో..మ‌రోసారి కోటంరెడ్డి దైవ సాక్షి గా అంటూ ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసారు. వైసీపీ నుండి అనంత‌పురం జిల్లా క‌ర్నూలు ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ ఇద్ద‌రూ ఆంగ్లంలో ప్ర‌మాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేల‌తో బాల‌య్య‌..

వైసీపీ ఎమ్మెల్యేల‌తో బాల‌య్య‌..

అసెంబ్లీ స‌మావేశాల కోసం వ‌చ్చిన టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ స‌భ‌లో సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్ వైసీపీ సీనియ‌ర్ నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు..మంత్రి కొడాలి నానికి అభి నంద‌న‌లు తెలిపారు. ఇక‌, బాల‌కృష్ణ సైతం త‌న‌కు ఎదురైన ఎమ్మెల్యేల‌కు అభినంద‌న‌లు తెలియచేసారు. ఇక‌, స‌భ‌లో నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి త‌న ప్రమాణ స్వీకారం పూర్తియ‌న త‌రువాత బాల‌కృష్ణ వ‌ద్ద‌కు వెళ్లి క‌ర‌చాల‌నం చేసారు. ఇక‌, టీడీపీలో గంటా, బాల‌కృష్ణ‌, సీనియ‌ర్లు మిన‌హా మిగిలిన వారు దాదాపు అందరూ పార్టీ అధినేత‌కు న‌మ‌స్క‌రించి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+