ఇసుక కొరతపై టీడీపీ ఉద్యమం ... గృహ నిర్బంధాలు , అరెస్ట్ లతో ఆందోళన పర్వం

ఇసుక కొరతపై ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, శ్రేణులకు పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు టీడీపీ నేతల నేడు ఆందోళనల బాట పట్టారు. ఏపీలో నెలకొన్న ఇసుక కొరత పై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయాలని చంద్రబాబు ఆదేశంతో ఆందోళనకు ఉపక్రమించిన మాజీ మంత్రులను ,మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్నారు. కొందరిని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తం గా ఇసుక సమస్య పై అన్దొఅలనలు కొనసాగుతున్న నేపధ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనలను అడ్డుకునే యత్నం చేస్తున్నారు.

ఇసుక ఇబ్బందులపై ఆందోళన ..దేవినేని ఉమా హౌస్ అరెస్ట్

ఇసుక ఇబ్బందులపై ఆందోళన ..దేవినేని ఉమా హౌస్ అరెస్ట్

ఇసుక ఇబ్బందులపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఆందోళనలను భగ్నం చేసే క్రమంలో పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వెళ్తుండగా పోలీసులు ఆయనను అడ్డుకుని హౌస్‌ అరెస్టు చేశారు. ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు ఉమాకి నోటీసులు జారీ చేశారు. అయితే ఇది ప్రజా స్వామిక విధానం కాదని దేవినేని మండిపడ్డారు. శాంతియుతంగా ధర్నా చేసేవారిని హౌస్‌ అరెస్టు చేయడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డంపెట్టుకుని సీఎం జగన్‌ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. చాలా మంది టీడీపీ నేతలను హౌస్‌ అరెస్టు చేశారని మండిపడ్డారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసీని తీసుకురావాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

ఏలూరులో చింతమనేని , కృష్ణా జిల్లాలో బచ్చుల అర్జునుడు గృహ నిర్బంధం

ఏలూరులో చింతమనేని , కృష్ణా జిల్లాలో బచ్చుల అర్జునుడు గృహ నిర్బంధం

ఏలూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ని గృహ నిర్బంధం చేశారు. ఆందోళనను ఉధృతం చేస్తామని చింతమనేని ప్రకటించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు చింతమనేని గృహనిర్బంధం చేశారు. దీంతో పోలీసులు గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అలాగే కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడిని హౌస్ అరెస్టు చేశారు.

 పాలకొల్లులో నిమ్మల రామా నాయుడు హౌస్ అరెస్ట్ .. అనంతరం తూర్పు గోదావరి తరలింపు

పాలకొల్లులో నిమ్మల రామా నాయుడు హౌస్ అరెస్ట్ .. అనంతరం తూర్పు గోదావరి తరలింపు

పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసంవద్ద పోలీసులు భారీగా మోహరించి ఆయనను బయటకు వెళ్లనీకుండా నిలువరించారు. ఇసుక ఇబ్బందులపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకు పిలుపు ఇచ్చినే నేపథ్యంలో ఆయన ఆందోళనకు దిగకుండా తెల్లవారుజామున పోలీసులు నిమ్మల నివాసం వద్ద మోహరింఛి ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఇక నిమ్మల రామానాయుడు విషయంలో కేవలం హౌస్ అరెస్ట్ చేసి ఆగని పోలీసులు ఆయనను నరసాపురం తీసుకువెళుతున్నట్టు చెప్పిన పోలీసులు చించినాడ మీదుగా తూర్పుగోదావరి తరలించారు. దీంతో కార్యకర్తలు నిమ్మల అరెస్ట్ పై ఆందోళనలో ఉన్నారు. ఎమ్మెల్యే నిమ్మల స్వచ్ఛందంగా తాను వస్తానని చెబుతున్నప్పటికీ పోలీసులు దౌర్జన్యంగా లాక్కెళ్లారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులు అందర్నీ హౌస్ అరెస్టుచేసి కేవలం పాలకొల్లు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి బయటకు తీసుకు వెళ్లడం చర్చనీయాంశమైంది.

 ప్రభుత్వంపై మండిపడ్డ నారా లోకేష్ .. గుంటూరులోనూ కొనసాగిన ఆందోళన

ప్రభుత్వంపై మండిపడ్డ నారా లోకేష్ .. గుంటూరులోనూ కొనసాగిన ఆందోళన

ఇక మంగళగిరిలో ఇసుక సమస్యపై చేపట్టిన ధర్నాలో నారా లోకేష్ పాల్గొని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు తుగ్లక్‌ పాలన చూస్తున్నారని చెప్పారు. ఇసుక ధర 9 రెట్లు ఎందుకు పెరిగిందని నిలదీశారు. అమరావతిలో పనులు నిలిచిపోవడంతో వేల మంది ఉపాధి కోల్పోయారన్నారు. 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నారా లోకేష్ . గుంటూరులోని లాడ్జి సెంటర్‌లో ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆధ్వర్యంలో ఇసుక సమస్య పై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇక నెహ్రూనగర్‌లో తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+