నర్సీపట్నంలో సినీ ఫక్కీలో గంజాయి ముఠా ఛేజ్- పారిపోతూ కార్లను గుద్దేసి-చెరువులో దూకినా
విశాఖ జిల్లా నుంచి అక్రమ గంజాయి రవాణా వివిధ రాష్ట్రాలకు జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఏపీ పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దీనికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అయితే అడపాదడపా గంజాయి స్మగ్లర్లు, పెడ్లర్లను అరెస్టులు చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఇవాళ విశాఖ జిల్లా నర్సీపట్నంలో పోలీసులు మహారాష్ట్రకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న వారిని పట్టుకునే ప్రయత్నం సినీ ఫక్కీని తలపించింది.
మహారాష్ట్రకు చెందిన గంజాయి స్మగ్లింగ్ ముఠా బీభత్సం సృష్టించింది. నర్సీపట్నంలో ఈ ముఠా ప్రయాణిస్తున్న వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ గుర్తించారు. దాంతో ఎస్‌ఐ ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇది పసిగట్టిన స్మగ్లర్లు కారు మరింత వేగంగా నడిపి,ఇతర వాహనాలను ఢీకొట్టుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నించారు. కాసేపు ఛేజ్ తర్వాత స్మగ్లర్లు తాము ప్రయాణిస్తున్న కారు వదిలేసి చెరువులోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు.

రోడ్డుపై కారును వదిలేసి పక్కనే ఉన్న చెరువులోకి దూకారు. వెంటనే ఈ విషయాన్ని ట్రాఫిక్ ఎస్‌ఐ, నర్సీపట్నం రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారంతా ఘటనాస్థలికి చేరుకున్నారు. చెరువు చుట్టూ పోలీసులను మోహరించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

మిగతా వారు పారిపోయినట్లు తెలుస్తోంది. వీరి నుంచి గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన వివరాల్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది, దీని వెనుక ఎవరున్నారనే దానిపై వివరాలు తెలుసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications