ఏపీకి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్: రూట్ ఇదే- పట్టాలెక్కేది అప్పుడే
Vande Bharat express: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 51 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ- మరింత వినూత్నంగా తీర్చిదిద్దబోతోంది. ఇందులో భాగంగా కొత్తగా స్లీపర్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే సిద్ధం అయ్యాయి. చెన్నై కోచ్ ఫ్యాక్టరీలో అవి రూపుదిద్దుకుంటోన్నాయి. త్వరలోనే అవి అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టింది.
ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది రైల్వే మంత్రిత్వ శాఖ. కిందటి నెల 12వ తేదీన 10 వందే భారత్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భువనేశ్వర్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ కూడా ఉంది.
ఏపీకి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేటాయించేలా అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అంతర్రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఇది. విశాఖపట్నం నుంచి పొరుగునే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ మధ్య ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. విశాఖపట్నం- దుర్గ్ రూట్‌ను ఖరారు చేశారు. ఈ మార్గంలో ఇప్పటివరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో లేదు.
విశాఖపట్నంలో బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ విజయనగరం జంక్షన్, బొబ్బిలి జంక్షన్, పార్వతిపురం, రాయగడ, ఖండేల్ రోడ్, టిట్లాగఢ్ జంక్షన్, మహాసముంద్, రాయ్‌పూర్ జంక్షన్, భిలాయ్ మీదుగా దుర్గ్‌కు చేరుతుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 566 కిలోమీటర్లు. రాకపోకలు సాగించడానికి ప్రస్తుతం 15 నుంచి 16 గంటల సమయం పడుతోంది.
వందే భారత్ వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. 6 నుంచి 7 గంటల్లోగా గమ్యాస్థానాలకు చేరుకోవచ్చు. ఈ మార్గంలో కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ఈ ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఎన్నికల కోడ్ తరువాత ఈ రైలు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications