విశాఖ జూలో అరుదైన తెల్ల పులి మృతి

విశాఖపట్నం: ఇందిరాగాంధీ జూ పార్కులో ప్రజలను ఎంతగానో ఆకట్టుకునే తెల్ల పులి కుమారి(19) కన్నుమూసింది. అనారోగ్యం కారణంగా కుమారి మృతి చెందింది. విశాఖపట్నం జూ పార్కులో సుమారు 16 సంవత్సరాలపాటు సందర్శకులను అలరించడంతోపాటు తన సంతతిని పెంచింది.

జూ ఎన్‌క్లోజర్‌లో హుషారుగా తిరుగుతూ చెట్లు ఎక్కుతూ.. పరుగెత్తుకుంటూ సందర్శకులను కనువిందు చేసేది ఈ తెల్ల పులి. ఇప్పుడు ఆ కుమారి లేదని జూ అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 2007 కంటే ముందు ఇందిరాగాంధీ జూ పార్కులో తెల్ల పులులు ఉండేవి కాదు. దీంతో అప్పటి జూ అధికారులు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి కుమారితోపాటు మగ తెల్ల పులిని 2007లో విశాఖ జూకు తీసుకొచ్చారు.

White Tiger kumari dies in Visakhapatnam Zoo

అప్పట్నుంచి అప్పట్నుంచి ఈ పులులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కుమారి మూడుసార్లు గర్భం దాల్చింది. మొత్తం 9 కూనలకు జన్మనిచ్చి జూలో వాటి సంతతిని పెంచింది. వాటిలోనే కొన్నింటిని జంతు మార్పిడి పద్ధతి ద్వారా ఇక్కడి అధికారులు ఇతర జూ పార్కులకు తరలించి అక్కడ్నుంచి కొన్ని జంతువులను విశాఖ జూకు తీసుకొచ్చారు.

కాన్పూర్ జూకి రెండు తెల్ల పులులను ఇచ్చి.. అక్కడ్నుంచి ఒక మగ ఖడ్గ మృగాన్ని తీసుకొచ్చారు. ఇతర జూ పార్కులకు తరలించడం, కుమారి మృతితో ప్రస్తుతం జూలో తెల్ల పులుల సంఖ్య ఐదుకు చేరినట్లు ఇంఛార్జి క్యూరేటర్, ఏసీఎఫ్ మంగమ్మ తెలిపారు. వృద్ధాప్యం కారణంగా కొన్ని అవయవాలు కూడా పనిచేయకపోవడంతో కుమారి మరణించిందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని ఆమె తెలిపారు.

కునో జూలో మరో చీతా మృతి

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో మరో చీతా మృతి చెందింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన దక్ష అనే ఆడ చీతాపై రెండు మగ చీతాలు దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. గాయపడిన చీతాకు చికిత్స చేయిస్తుండగా.. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మృతి చెందినట్లు చెప్పారు.

మగ చీతాలు వాయు, అగ్ని ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి ఆడ చీతా దక్షను పునరుత్పత్తి కోసం ఉంచారు. అయితే రెండు మగ చీతాలు దక్ష మీద దాడి చేసినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో రెండు ఇదివరకే మరణించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+