వైఎస్సార్ పేరును చెరిపేశారు..!!

Chandrababu Naidu: రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి దక్కింది.. పట్టుమని 11 స్థానాలే.

కంచుకోటల్లాంటి నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. విశాఖపట్నం- 2, చిత్తూరు-2, కడప- 3, కర్నూలు- 2, ప్రకాశం- 2.. ఇవీ ఆ పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల సంఖ్య. అటు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఇవే ఫలితాలు కనిపించాయి. నాలుగు చోట్ల మాత్రమే గెలిచింది వైఎస్ఆర్సీపీ.

YSR View point at Visakhapatnam renamed as Abdul Kalam

2019 నాటి ఎన్నికల్లో టీడీపీకి లభించిన సీట్ల కంటే కూడా దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఆ ఎన్నికల్లో 23 సీట్లను దక్కించుకుంది టీడీపీ. ఇప్పుడు పట్టుమని పది సీట్లకు మాత్రమే పరిమితం కావడం వైసీపీ దీనస్థితికి అద్దం పట్టినట్టయింది. అయిదు సంవత్సరాలు తిరిగే సరికి వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతకంటే దారుణంగా మారడం ఓటర్లల్లో ఆ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఈ ఓటమిని వైఎస్ జగన్ అంగీకరించారు. ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. పోరాటం తమకు కొత్త కాదని, ప్రజల తరఫున పోరాడుతామని పేర్కొన్నారు. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్‌గా ఉంటామని, పేద ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామనీ అన్నారు. అనంతరం తన పదవికి రాజీనామా చేశారు.

దీని తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లో జోష్ పెరిగింది. విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరును ధ్వంసం చేశారు. డాక్టర్ వైఎస్సార్ అనే అక్షరాలను తొలగించారు. దాని స్థానంలో ఎన్టీఆర్ అనే అక్షరాలను తగిలించారు. ఎన్టీ రామారావు, చంద్రబాబు, టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేశారు.

ఇప్పుడు తాజాగా అలాంటి ఉదంతమే విశాఖపట్నంలోనూ సంభవించింది. వైజాగ్ బీచ్ రోడ్‌లో జగన్ ప్రభుత్వం నిర్మించిన వ్యూ పాయింట్ పేరును గుర్తు తెలియని వ్యక్తులు మార్చివేశారు. నిన్నటి వరకు డాక్టర్ వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా ఉండేది ఇది. నేమ్ బోర్డ్‌లో ఉన్న డాక్టర్ వైఎస్సార్ అనే అక్షరాలను తొలగించి.. వాటి స్థానంలో అబ్దుల్ కలాం పేరును అతికించి ఉండటం కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+