చికాగోలో గుజరాత్ యువకుడి దారుణ హత్య
చికాగో: అమెరికాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ళ ఆర్షద్ వోరాను దుండగులు కాల్చి చంపారు. గుజరాత్‌లోని నదియాద్ ప్రాంతం ఆర్షద్ వోరా స్వస్థలం.
అమెరికాలోని చికాగోలో డాల్టన్ గ్యాస్ స్టేషన్ దగ్గర దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. అదే సమయంలో గ్యాస్ స్టేషన్‌లో ఉన్న గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల ఆర్షద్ వోరాపై దుండగులు తుపాకీ కాల్పులకు తెగబడ్డారు.

ఈ ఘటనలో వోరా అక్కడికక్కడే మృతి చెందారు. ఇతర కుటుంబ సభ్యులు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటన గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. గుజరాత్‌లోని నదియాద్ ప్రాంతం ఆర్షద్ వోరా స్వస్థలం.












Click it and Unblock the Notifications