వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెనడాలో ఘనంగా టిడిఎఫ్ తెలంగాణ నైట్

కార్యక్రమంలో ముందుగా 1969 తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరులతో పాటు ఇటీవల అసువులుబాసిన 39 మంది 'తెలంగాణ' అమరులకు ఆహూతులు ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే ఇటీవల మృతిచెందిన తెలంగాణ పోరాటయోధుడు, మాజీ ఎమ్మెల్యే పులివీరన్నకు కూడా సభికులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ సాధన కోసం 1969 ఉద్యమం మొదలుకొని మొన్న మరణించేవరకూ పులివీరన్న పోరాట పటిమను సభికులు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపూ ఆహూతుల 'జై తెలంగాణ' నినాదాలతో సమావేశ ప్రాంగణం మారుమ్రోగింది.