న్యూజెర్సీలో కూచిపూడి నృత్య ప్రదర్శన

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ కూచిపూడి నృత్యానికి విశేష ప్రాముఖ్యత ఉందన్నారు. నృత్యమాధవి నాట్య కళాశాల వ్యవస్థాపకురాలు ఏలూరి దివ్య వద్ద శిక్షణ పొందిన 100 మంది బాలబాలికలు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. నృత్యంలో విశేష ప్రతిభ చూపుతున్న మేడిచెర్ల శైలజ, రాహుల్ రెడ్డిలను కళాశాల డైరెక్టర్ ఏలూరి వేణు సత్కరించారు. కళా రంగాల్లోని వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అందజేసే అవార్డులను ఈ సారి 'వైవిద్య రత్న' పేరుతో ప్రకాశరావుకు, 'సంగీత సౌజన్య' పేరిట డాక్టర్ భవానీ ప్రకాశ్‌లకు అందజేశారు. కార్యక్రమంలో ఆనంద్ పాలూరి, తోట రవీందర్, గేదెల దాము, నేమన సత్య తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications