వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొయిలీపై ఎన్నారైల ఆగ్రహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
కొత్త రాష్ట్ర ఏర్పాటుకు తొలుత శాసనసభలో తీర్మానం చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ అనడంపై తెలంగాణ ఎన్నారైలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొయిలీ ప్రకటనను తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడిఎఫ్) యుకె, ఐరోపా శాఖలు ఖండించింది. పార్లమెంటు సభ్యుడైన మొయిలీకి భారత రాజ్యాంగం గురించి తెలియకపోవడం దయనీయమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు టిడిఎఫ్ యుకె, ఐరోపా శాఖ మీడియా కార్యదర్శి నాగేందర్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటేరియన్లు బిల్లు ప్రతిపాదించాల్సి ఉంటుందని, నిర్ణీత కాల వ్యవధిని నిర్ధారించి రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభ అభిప్రాయం అడుగుతారని, శాసనసభ అభిప్రాయం ఎలా ఉన్నా పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించవచ్చునని ఆయన అన్నారు.

సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, మంత్రుల పక్షం తీసుకుని ప్రజాస్వామ్య పవిత్ర స్థలమైన పార్లమెంటులో రాజ్యాంగం గురించి తెలియకుండా మొయిలీ ఆ విధంగా మాట్లాడి ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. 294 మంది సభ్యుల శాసనసభలో 175 అంటే 60 శాతం మంది శాసనసభ్యులు సీమాంధ్రకే చెందినవారైనప్పుడు శాసనసభలో తీర్మానం ఆమోదం పొందడం ఎలా సాధ్యమవుతుందని ఆయన అడిగారు. పార్లమెంటులో మెజారిటీ ద్వారా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను రాష్ట్రస్థాయిలో కాకుండా కేంద్ర స్థాయిలోనే పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. నిరాధారమైన ప్రకటన చేసినందుకు మొయిలీ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని టిడిఎఫ్ డిమాండ్ చేసింది.

English summary
Telangana Development Forum UK & Europe, severely condemns the statement given by Mr. Veerappa Moily in parliament “mentioned that that for formation of a new state a resolution has to be first passed by the Andhra Pradesh Assembly”It is very pity that being a member of parliament, Mr. Moily doesn’t have awareness on Indian constitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X