అమెరికాలో స్నిగ్ధ సువర్ణ భరతనాట్యం

Snigdha Suvarna
స్వర్గీయ సువర్ణ సరోజన, సువర్ణ రామన్న మనవరాలు స్నిగ్ధ సువర్ణ అమెరికాలో భరతనాట్య ప్రదర్శనలోకి ప్రవేశించింది. అమెరికాలోని విస్కాన్సిన్‌లో గల మాడిసన్ స్టౌటాన్ హై స్కూల్‌లో ఏప్రిల్ 21వ తేదీన ప్రదర్శన ఇచ్చింది. గురు మీనాక్షి గణేషన్, గురు పద్మిని రాధాకృష్ణన్, గురు బి. అనంతరామన్, గురు శ్రీరామ్ నటరాజన్ మార్గదర్శకత్వంలో ఆమె ప్రదర్సన ఇచ్చింది.

స్నిగ్ధ తల్లిదండ్రులు మాధవి సువర్ణ, శ్రీధర్ సువర్ణ కరీంనగర్ జిల్లా మంథనికి చెందినవారు. గత 14 ఏళ్లుగా వారు అమెరికాలో ఉంటున్నారు. స్నిగ్ధ తన 7వ యేట గురు మీనాక్షి గణేషన్ మార్గదర్శకత్వంలో కళాంజలి డ్యాన్స్ స్కూల్ ద్వారా భరతనాట్యం విద్యార్థినిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. గత ఏడేళ్లుగా ఆమె భరత నాట్యాన్ని ఏకదీక్షతో అభ్యసిస్తోంది. 2007లో తొలిసారి వేదిక మీద ప్రదర్శన ఇచ్చింది. అప్పటి నుంచి పలు కార్యక్రమాల్లో పాల్గొంది.

గంట పాటు స్నిగ్ధ ఇచ్చిన ప్రదర్శనను ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూశారు. అమెరికన్లు, భారతీయులు ఆమె ప్రదర్శనను తిలకించారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ప్రధాన కార్యదర్సి మురళీ గౌడ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్నిగ్ధను ఆయన ఉత్తర అమెరికా నాట్య మయూరిగా అభివర్ణించారు.

స్నిగ్ధ గతంలో లెమెంటో దేవాలయం మిడ్‌వెస్ట్ డ్యాన్స్ ఫెస్టివల్, ఐల్, క్లీవ్‌ల్యాండ్ త్యాగరాజ ఆరాధన వంటి కార్యక్రమాల్లో నృత్యపోటీల్లో పాల్గొంది. విస్కాన్సిన్ చుట్టుపక్కల కళాంజలి డ్యాన్స్ స్కూల్ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె ప్రదర్శనలు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+