చాలా సంతోషంగా ఉందబ్బా: ఎస్పీ

"చాల సంతోషంగా ఉంది అబ్బా పిలిచినందుకు" అంటూ చిత్తూరు యాసలోని మాధుర్యాని తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన డా. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం - చిత్తూరువాసులను ఒక గొడుగు కిందకు తెచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు చిత్తూరు ప్రవాసులను అభినందించారు. తన అమ్మ గారి ఊరు , తను జన్మించినది నగరి దగ్గరిలో కోనేటంపేట అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. తన విద్యాభ్యాసం తిరుపతిలో జరిగిందని చెప్పారు . తెలుగు భాష అంతరించిపోదని, తెలుగు వాళ్ళు తమ పిల్లలను తెలుగు బడులలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు . తోటి వారికి సహాయం చేసినా, చేయకపోయినా హాని మాత్రం చేయవద్దని చెప్పారు.
అంతకుముందు ప్రారంభోపన్యాసం చేస్తూ చిత్తూరు ప్రవాస భారతీయుల సంఘం అధ్యక్షుడు రావిళ్ళ విజయ్ తమ సంస్థ తరపున చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు. అలాగే ఇక ముందు చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ, వాటిని చేపట్టడానికి సహాయం చేయవలసిందిగా చిత్తూరు వాసులను అభ్యర్థించారు. కొత్తగా చిత్తూరు జిల్లా నుండి అమెరికా వచ్చిన విద్యార్ధులకు శిక్షణ తరగతులు, ఉద్యోగ అవకాశాలకు సహాయం చేస్తామని చెప్పారు. స్వచంద కార్యకర్తలు, న్యాయవాదులు, వైద్యులు, రాజకీయ నాయకుల సహాయ సహకారాలతో అమెరికాలో నివాసం ఉన్న చిత్తూరు జిల్లా వాసులకు అన్నిరకాల సహాయం అందిస్తుందని చెప్పారు. అలాగే 2013-2015 సంవత్సరాలకు కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు.
ప్రత్యెక అతిధిగా విచ్చేసిన నాట్స్ అద్యక్షుడు రవీంద్ర మాదాల మాట్లడుతూ - తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా , నాట్స్ 5కే రన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన చిత్తూరు ప్రవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంస్థతో కలిసి నాట్స్ మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు.
నాట్స్ కార్యవర్గసభ్యుడు, చిత్తూరు వాసి ప్రసాద్ పాపుదేశి మాట్లాడుతూ- అన్ని తెలుగు సంఘాలతో కలిసి పనిచేస్తూ చిత్తూరు ప్రవాసుల శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలను మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్తామని తెలియచేసారు. అదే విధంగా జిల్లా లో కూడా విద్యార్థుల సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి తమ సంస్థ ద్వారా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
ప్రముఖ ఎన్నారై, చలన చిత్ర నటుడు డాక్టర్ హరనాధ పొలిచెర్ల మాట్లడుతూ - చిత్తూరు ప్రవాస భారతీయుల సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు . తిరుపతి యాస, తనకు చాలా ఇష్టమని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ చైర్మన్ రణకుమార్ నాదెళ్ళ, సంబరాలు కన్వీనర్ శ్రీనివాస్ కోనేరు, "సేవ" సంస్థ ప్రతినిధులతో పాటు అనేక మంది ప్రవాస చిత్తూరు వాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన రవి తిరువాయిపాటి విచ్చేసిన అతిథులకు, జిల్లా ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలియజేశారు.
నూతన కార్యవర్గం: కార్యనిర్వాహక అధ్యక్షుడు - సునీల్ పంత్ర , ముఖ్య కార్యదర్శి- గిరి ప్రసాద్ , కోశాధికారి- శివ లంకిపల్లి , ప్రసార మాధ్యమం, ప్రచార వ్యవస్థ కార్యదర్శి -మహేష్ దాసరి












Click it and Unblock the Notifications