దైవ కటాక్షం కోసం షాఫ్ట్‌లోకి దూకి...

Indian-American jumps into 100-ft mine-shaft to 'appease gods'
వాషింగ్టన్: దైవ కటాక్షం కోసం 28 ఏళ్ల ఇండియన్ అమెరికన్ 100 అడుగుల మైన్ షాఫ్ట్‌లోకి దూకాడు. అరిజోనాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు శ్రమించి అతన్ని బయటకు తీశారు. కాలిఫోర్నియాలోని యూనియన్ సిటీ నుంచి 28 ఏళ్ల పర్మీందర్ సింగ్ అరిజోనాకు చేరుకుని జనవరి 11వ తేదీన మైన్ షాఫ్ట్‌లోకి దూకాడు.

మైన్ షాఫ్ట్ సూటిగా వంద అడుగుల లోతు ఉంది. 20 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న స్థితిలో 30 మందితో కూడిన సహాయక బృందాలు అన్ని బయటకు తీయడానికి ప్రయత్నించాయి. దైవ కటాక్షం కోసం తనంత తానే అందులోకి దూకానని పర్మీందర్ సింగ్ ఆ తర్వాత పోలీసులకు చెప్పాడు.

అక్కడి నుంచి అతన్ని ఫ్లాగ్‌స్టాఫ్ వైద్య కేంద్రానికి తరలించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తేలింది. షాఫ్ట్‌లోకి వెళ్లడం చాలా శ్రమతో కూడిన పనిగా తయారైందని అంటున్నారు. రాత్రి 8.22 నిమిషాల ప్రాంతంలో షాఫ్ట్‌లోంచి రెస్క్యూ టీమ్ సభ్యుల పిలుపునకు ప్రతిస్పందనలు వినిపించాయి. దాంతో అతను జీవించే ఉన్నట్లు నిర్ధారణ అయింది.

శరీరం గడ్డ కట్టే జీరో డిగ్రీల ఉష్ణోగ్రతలో బాధితుడు ఏం చెబుతున్నాడనేది రెస్క్యూ టీమ్ సభ్యులకు అర్థం కాలేదు. లోనికి ఆహారం, నీల్లు, పోర్టబుల్ రేడియో, వేడినిచ్చే దుస్తులు, ఫ్లాషింగ్ లైట్ పంపించినట్లు తెలిపారు. చివరకు అతన్ని బయటకు లాగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+